Telagram New Features: టెలిగ్రామ్‌ అదిరిపోయే ఫ్యూచర్స్‌.. ఆ కొత్త ఫీచర్స్ ఏంటంటే..!

|

Nov 12, 2021 | 10:08 AM

Telagram New Features: ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తూ వస్తున్న టెలిగ్రామ్‌ ఛాటింగ్‌ సంస్థ..

Telagram New Features: టెలిగ్రామ్‌ అదిరిపోయే ఫ్యూచర్స్‌.. ఆ కొత్త ఫీచర్స్ ఏంటంటే..!
Telegram
Follow us on

Telagram New Features: ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తూ వస్తున్న టెలిగ్రామ్‌ ఛాటింగ్‌ సంస్థ.. తాజాగా మరో నాలుగు కొత్త ఫీచర్స్‌ను తీసుకొచ్చింది. వీటితో యూజర్స్‌ టెలిగ్రామ్‌ యాప్‌ను గతంలో కంటే మెరుగ్గా ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఇంతకీ ఆ అదిరిపోయే ఫీచర్లేంటో మీరే చూడండి.

చాలా మంది యూజర్స్‌ టెలిగ్రామ్‌ చాట్‌లో వచ్చే ఫైల్స్‌ను క్లౌడ్‌లో స్టోర్‌ చేసుకుంటారు. వాటిలో ఫొటోలు, వీడియోలు, ఫైల్స్, మ్యూజిక్‌ ఇలా ఎన్నో ఉంటాయి. తాజాగా వీటికి డేట్‌ బార్‌ అనే ఫీచర్‌ను యాడ్‌ చేసింది టెలిగ్రామ్‌. దీని ద్వారా యూజర్‌ ఫైల్స్‌ ఏ తేదీన వచ్చాయనేది సులువుగా తెలుసుకోవచ్చు. అలానే ఫైల్స్‌ని పై నుంచి కిందకి వేగంగా స్క్రోల్ చేయొచ్చు. దానితోపాటు జూమ్‌ ఇన్‌ అండ్ ఔట్ ఆప్షన్‌ కూడా ఇస్తున్నారు. దీంతో యూజర్‌కి రెండు థంబ్‌నెయిల్స్‌ కనిపిస్తాయి. వాటిని టచ్‌ చేస్తే ఆ ప్రాంతంలోని ఫొటోలు జూమ్‌ అవుతాయి. వాటిలో మీకు కావాల్సిన ఫొటోను సులువుగా గుర్తించవచ్చు.

ఈ ఫీచర్‌తో యూజర్స్‌ ఏ తేదీన ఏయే ఫైల్స్‌ వచ్చాయనేది తెలుస్తుంది. క్యాలండర్‌లో తేదీపైన క్లిక్‌ చేస్తే మీకు ఆ రోజు ఏమేం ఫొటోలు వచ్చాయనే జాబితా చూపిస్తుంది. అలానే ఇందులో ఫిల్టర్‌ షేర్‌ మీడియా అనే ఫీచర్‌ను యాడ్‌ చేశారు. దీని ద్వారా మనం షేర్‌ చేసిన ఫైల్స్‌లో కావాల్సిన వాటిని చూడొచ్చు. ఇందుకోసం యూజర్‌ ఏదైనా చాట్‌ పేజ్‌ ఓపెన్‌ చేసి అందులో కుడివైపు మూడు చుక్కలపైన క్లిక్ చేస్తే మీకు షో క్యాలండర్, షో ఫొటోస్‌, షో వీడియోస్‌ ఆప్షన్స్‌ కనిపిస్తాయి.

ఇతర మెసేజింగ్ యాప్‌లలో గ్రూప్‌లో జాయిన్ అవ్వాలంటే గ్రూప్‌ అడ్మిన్‌ జాయిన్ చేయడంతోపాటు ఇన్వైట్ లింక్‌, క్యూఆర్‌ కోడ్ స్కానింగ్ వంటి ఫీచర్లున్నాయి. తాజాగా టెలిగ్రామ్‌లో కూడా ఇన్వైట్‌ లింక్‌ ఫీచర్‌ను పరిచయం చేశారు. ఇక మీదట గ్రూప్‌లో జాయిన్‌ కావాలనుకునే వారికి ఇన్వైట్ లింక్‌ షేర్‌ చేయాలి. వాళ్లు లింక్‌పై క్లిక్‌ చేసి జాయిన్‌ రిక్వెస్ట్ చేయగానే గ్రూప్‌ అడ్మిన్‌కు తెలుస్తుంది. తర్వాత అడ్మిన్‌ సదరు వ్యక్తి ప్రొఫైల్ పిక్చర్‌.. తదితర వివరాలు చూసి దాన్ని ఓకే చేయాల్సి ఉంటుంది.

Also read:

Hepatitis: డెంగ్యూతో బాధపడుతున్న వారికి కామెర్లు కూడా సోకే అవకాశం.. లక్షణాలు తెలుసుకుని జాగ్రత్త పడాలి!

Watch Video: ఆసీస్ చేతిలో ఘోర ఓటమి.. అనంతరం పాక్ డ్రెస్సింగ్ రూంలో ఏం జరిగిందంటే? వీడియో మీకోసమే.!

T20 World Cup 2021: ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ దెబ్బ.. సెమీ-ఫైనల్‌ సూపర్ హీరో ఔట్.. భారత సిరీస్‌కు డౌటే..!