
ఇప్పుడు కొత్త సిమ్ కార్డ్ పొందడానికి ఆధార్ కార్డ్ ద్వారా బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. అలాగే సిమ్ కార్డులు అమ్మే దుకాణదారులకు ప్రభుత్వం కఠినమైన నియమాలను రూపొందించింది.

కస్టమర్ పేరు మీద ఇప్పటికే జారీ చేసిన సిమ్‌ల సంఖ్యను దుకాణదారుడు తనిఖీ చేయాలి. కస్టమర్ వేర్వేరు పేర్లతో సిమ్ కార్డులు తీసుకున్నట్లయితే, దానిని కూడా ధృవీకరించాలి. కస్టమర్ గుర్తింపును నిర్ధారించడానికి, పది వేర్వేరు కోణాల నుండి ఫోటోలు తీయవలసి ఉంటుంది.

టెలికమ్యూనికేషన్ శాఖ కొత్త నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి తన ఆధార్ కార్డుపై గరిష్టంగా 9 సిమ్‌లను కొనుగోలు చేయవచ్చు. ఎవరైనా ఈ పరిమితిని దాటితే, మొదటిసారి రూ.50,000 జరిమానా విధిస్తారు. మళ్ళీ నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ.2 లక్షల జరిమానా విధిస్తారు.

నకిలీ పత్రాలతో సిమ్ పొందితే రూ.50 లక్షల వరకు జరిమానా, 3 సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు. మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్‌లు కొనుగోలు చేశారో కూడా మీరు సులభంగా సమాచారాన్ని పొందవచ్చు. దీని కోసం ముందుగా సంచార్ సాథీ పోర్టల్‌కి వెళ్లండి. సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ విభాగంపై క్లిక్ చేయండి. నో యువర్ మొబైల్ కనెక్షన్స్ ఆప్షన్‌ను ఎంచుకోండి.

మీ మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి. మీ నంబర్‌కు OTP వస్తుంది. దాన్ని ఉపయోగించి లాగిన్ అవ్వండి. ఇప్పుడు మీ పేరు మీద రిజిస్టర్ చేయబడిన అన్ని మొబైల్ నంబర్లు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఈ నియమాలను పాటించడం ద్వారా మీరు సిమ్ కార్డ్ సంబంధిత మోసాలను నివారించవచ్చు. అలాగే అనవసరమైన చట్టపరమైన సమస్యలను నివారించవచ్చు.