Tech Tips: ఫోన్‌ను 100% ఛార్జ్‌ చేస్తున్నారా?.. ఇక మీ ఫోన్‌ షెడ్డుకే.. ఎందుకంటే?

మీకు ఫోన్‌ను 100 శాతం ఛార్జ్ చేసే అలవాటు ఉంటే, వెంటనే మానుకోండి. ఎందకంటే ఇలా చేయడం వల్ల మీ ఫోన్‌ బ్యాటరీపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇది బ్యాటరీ లైఫ్‌ను తగ్గిస్తుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మీ ఫోన్‌ను ఎంత మేర చార్జింగ్ పెట్టాలో ఇక్కడ తెలుసుకుందాం.

Tech Tips: ఫోన్‌ను 100% ఛార్జ్‌ చేస్తున్నారా?.. ఇక మీ ఫోన్‌ షెడ్డుకే.. ఎందుకంటే?
చాలా ఫోన్‌లలో లిథియం-అయాన్ బ్యాటరీలు ఉంటాయి. ఈ బ్యాటరీలకు గరిష్ట ఛార్జ్‌ చేస్తే అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి. ఇది బ్యాటరీ జీవితకాలాన్ని తగ్గిస్తుంది. బ్యాటరీ 100% ఛార్జ్ అయినప్పుడు వేడెక్కే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ వేడి క్రమంగా బ్యాటరీ సామర్థ్యాన్ని నాశనం చేస్తుంది.

Updated on: Oct 03, 2025 | 10:45 PM

చాలా మందికి స్మార్ట్‌ఫోన్‌లను పూర్తిగా ఛార్జ్ చేసే అలవాటు ఉంటుంది . బ్యాటరీ 100 శాతం ఛార్జ్ అయ్యే వరకు వారు ఛార్జర్‌ను తీసివేయరు. కొంతమంది రాత్రి నిద్రపోతున్నప్పుడు ఫోన్‌ను ఛార్జ్‌లో ఉంచుతారు, మళ్లీ ఉదయం లేచాక తీస్తారు. కానీ ఇలా చేయడం చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఫోన్‌ను పదే పదే ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ పూర్తిగా తగ్గుతుంది అంటున్నారు. పెన్ స్టేట్ యూనివర్సిటీలోని ఎలక్ట్రోకెమికల్ ఇంజిన్ సెంటర్ డైరెక్టర్ చావో-యాంగ్ వాంగ్ ప్రకారం, మీ ఫోన్‌ను ప్రతిసారీ 100 శాతం ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీ లైఫ్‌ త్వరగా తగ్గిపోతుందట. ఎందుకంటే పూర్తిగా ఛార్జ్ చేయబడిన బ్యాటరీకి అధిక వోల్టేజ్ ఉంటుంది, ఇది బ్యాటరీలో రసాయన మార్పులకు కారణమవుతుంది. దీని వల్ల అది పాడైపోయే ప్రమాదం ఉంటుంది.

న్యూజెర్సీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ దిబాకర్ దత్తా ప్రకారం, ఈ మార్పులు కాలక్రమేణా బ్యాటరీని బలహీనపరుస్తాయి. మీరు మీ ఫోన్‌ను 90% ఛార్జ్ చేస్తే, బ్యాటరీ 10-15% ఎక్కువసేపు ఉంటుంది. బ్యాటరీని 100% ఛార్జ్ చేయడం వల్ల క్రమంగా దెబ్బతింటుంది. అంతేకాకుండా మీ ఫోన్ బ్యాటరీని ఎల్లప్పుడూ 20% నుంచి 80% మధ్య ఉంచుకోవడం మంచిది.

ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మీరు మీ ఫోన్‌ను ఎప్పుడు తీవ్రమైన చలి లేదా తీవ్రమైన వేడి ప్రాంతాల్లో ఉంచంకండి. ఇది మీరు బ్యాటరీని 100శాతం చార్జింగ్ చేయడం కంటే ప్రమాదం. మీ ఫోన్‌ను ఎక్కువ వాట్స్‌ ఉన్న ఫాస్ట్ చార్జర్‌తో కూడా చార్జింగ్‌ చేయొద్దని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల బ్యాటరీ దెబ్బతింటుందని చెబుతున్నారు.

మరిన్ని సైన్స్‌ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.