Smart watches: స్మార్ట్ వాచ్ లపై షాకింగ్ న్యూస్.. ఈజీగా హ్యాకింగ్ చేయవచ్చంటున్న నిపుణులు

స్మార్ట్ వాచ్ ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి చేతిమణికట్టుపై సర్వసాధారణంగా కనిపిస్తోంది. ప్రత్యేక ఫీచర్లు, స్లైలిష్ లుక్ తో కూడిన వివిధ బ్రాండ్ల స్మార్ట్ వాచ్ లు మార్కెట్లో అనేకం లభిస్తున్నాయి. వాటి ధర కూాడా అందుబాటులో ఉండడంతో ముఖ్యంగా యువత చాలా ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. టైమ్ తో పాటు ఫిట్ నెస్, హెల్త్, ట్రాకింగ్, హార్ట్ బీట్ తదితర వాటిని చాలా సులభంగా చూసుకోవచ్చు.

Smart watches: స్మార్ట్ వాచ్ లపై షాకింగ్ న్యూస్.. ఈజీగా హ్యాకింగ్ చేయవచ్చంటున్న నిపుణులు
Smart Watch
Follow us

|

Updated on: Aug 23, 2024 | 4:20 PM

స్మార్ట్ వాచ్ ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి చేతిమణికట్టుపై సర్వసాధారణంగా కనిపిస్తోంది. ప్రత్యేక ఫీచర్లు, స్లైలిష్ లుక్ తో కూడిన వివిధ బ్రాండ్ల స్మార్ట్ వాచ్ లు మార్కెట్లో అనేకం లభిస్తున్నాయి. వాటి ధర కూాడా అందుబాటులో ఉండడంతో ముఖ్యంగా యువత చాలా ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. టైమ్ తో పాటు ఫిట్ నెస్, హెల్త్, ట్రాకింగ్, హార్ట్ బీట్ తదితర వాటిని చాలా సులభంగా చూసుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే స్మార్ట్ వాచ్ ను మణికట్టుపై మినీ స్మార్ట్ ఫోన్ అనవచ్చు. ఇన్ని ఉపయోగాలు ఉన్న స్మార్ట్ వాచ్ ల గురించి పరిశోధకులు ఒక షాకింగ్ న్యూస్ చెప్పారు. వీటిలోని డేటా హ్యాకింగ్ కు గురయ్యే అవకాశం ఉందని నిరూపించారు.

చార్లెస్ డార్విన్ విశ్వవిద్యాలయం (సీడీయూ) పరిశోధకులు చేసిన అధ్యయనం ప్రకారం స్మార్ట్‌వాచ్‌లతో అనేక ఉపయోగాలు ఉన్నప్పటికీ అవి హ్యాకింగ్ గురయ్యే అవకాశం ఉంది. మన వ్యక్తిగత సమచారాన్ని సులభంగా దొంగలించగలరు. అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ఆన్ అడ్వాన్స్‌మెంట్ ఇన్ కంప్యూటేషన్ & కంప్యూటర్ టెక్నాలజీస్ (In CACCT)లో భాగంగా స్మార్ట్ వేరబుల్ డివైస్‌లపై వల్నరబిలిటీ అనాలిసిస్ అండ్ ఎక్స్‌ప్లోయిటేషన్ అటాక్స్ అనే విషయంపై నివేదిక ప్రచురించారు. ముందుగా పరిశోధకులు వివిధ రకాల స్మార్ట్ వాచ్ లను హ్యాకింగ్ చేశారు. వాటిలో లోపాల ఆధారంగా సమాచారాన్ని ఎలా చోరీ చేయగలరో ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఈ వాచ్ లు ఆయా వ్యక్తుల ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడం, ఫిట్‌నెస్‌ను పర్యవేక్షించడం తదితర వాటికి చక్కగా ఉపయోగపడతాయి. కానీ వీటిలో బ్లూటూత్ తక్కువ శక్తి (బీఎల్ఈ) సాంకేతికతను ఉపయోగిస్తారు. దీనివల్ల వాచ్ లో సమాచారానికి భద్రత ఉండదు.

భద్రత కరవు

సీడీయూలోని సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అధ్యాపకుడైన స్టడీ సూపర్‌వైజర్ డాక్టర్ భరణిధరన్ షణ్ముగన్ తెలిపిన వివరాల ప్రకారం.. హ్యాకర్లు స్మార్ట్ వాచ్ ధరించిన వ్యకి పల్స్ రేట్ ను పెంచగలరు, లేదా తగ్గించగలరు. అతడు ఎక్కడకు వెళ్లాడు, ఎంత సమయం గడిపాడో తెలుసుకోగలరు. గుండె వేగం, రక్తపోటు, ఈసీజీ రీడింగ్ లను కూాడా చూడగలరు. కాబట్టి బీఎల్ఈ పరికరాలకు పెరుగుతున్న ప్రజాదరణను దృష్టిలో ఉంచుకుని, తయారీదారులు పటిష్టమైన భద్రతా విధానాలను ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. స్మార్ట్‌వాచ్ తయారీదారులు భద్రత విషయాన్ని పట్టించుకోవడం లేదనిడానికి ఇదే నిదర్శనం.

ఇవి కూడా చదవండి

అనేక ఇబ్బందులు

ఇలాంటి విధానాలు సమాజంలో అనేక ఇబ్బందులను కలిగిస్తాయి. అనేక ప్రతికూల పరిణామాలకు దారి తీస్తాయి. దీనివల్ల గోప్యంగా ఉండాల్సిన సమాచారం హ్యాకర్ల చేతిలోకి వెళుతుంది. దీని వల్ల అనేక కష్టాలతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా పడే అవకాశం ఉంది. ఆరోగ్యానికి సంబంధించి డేటా చాలా రహస్యంగా ఉంది. అది మోసగాళ్ల చేతిలోకి వెళితే..బ్లాక్‌మెయిల్ తో పాటు శారీరక హాని కలిగించడానికి కారణం కావచ్చు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి