సునీతా విలియమ్స్ తిరిగి వచ్చేదెప్పుడు..?
TV9 Telugu
23 August 2024
సునీతా విలియమ్స్ అంతరిక్షం నుండి తిరిగి రావడం ఒక పజిల్‌గా మారింది. ఆమె జూన్ 5, 2024న బోయింగ్ స్టార్‌లైనర్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు.
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌తో కలిసి గత రెండు నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్నారు.
సునీతా విలియమ్స్‌తోపాటు బుచ్ విల్మోర్ అంతరిక్షంలో ఎక్కువ కాలం జీవించిన నాసాకు చెందిన వ్యోమగాములుగా నిలిచారు.
వ్యోమగామిలు ఇద్దరూ ఎప్పుడు భూమిపైకి వస్తాడో తెలియదు. వారిని త్వరగా తీసుకువచ్చేందుకు నాసా మరో కొత్త మిషన్‌పై పని చేయడానికి ప్లాన్ చేసింది.
NASA ఇప్పుడు ప్రోగ్రామ్ కంట్రోల్ బోర్డ్, ఏజెన్సీ ఫ్లైట్ రెడీనెస్ రివ్యూ అనే రెండు సమీక్షలను నిర్వహించాలని యోచిస్తోంది.
ఈ రెండు సమీక్షల ద్వారా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను ఏ మార్గంలో సురక్షితంగా భూమిపైకి తీసుకురావచ్చో తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది.
NASA వ్యోమగాములు ఇద్దరూ జూలైలో తిరిగి వస్తారని భావించారు. అయితే అంతరిక్ష నౌక కొన్ని థ్రస్టర్‌లు పనిచేయకపోవడంతో, వారు ఇక్కడ ఉండిపోయారు.
వ్యోమగామిలను వెనక్కి తీసుకురావడానికి గడువు ముగియనుంది. ఆగస్ట్ నెలాఖరులోగా నాసా ముందుకు వెళ్లే మార్గంపై నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి