Rare PMDS Case: అబ్బాయి శరీరంలో గర్భాశయం.. పిల్లలు పుట్టట్లేదని హాస్పిటల్‌కు వెళ్లగా..

సంతానలేమి సమస్యతో హాస్పిటల్‌కు వెళ్లిన ఓ యువకుడికి ఊహించని పరిణామం ఎదురైంది. సమస్య ఏంటని అతనికి టెస్ట్ జరిపిన వైద్యులకు షాకింగ్ విషయం తెలిసింది. అతని శరీరంలో గర్భాషయం ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దీన్ని పర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిండ్రోమ్ అంటారని.. ప్రపంచ వైద్య చరిత్రలోనే ఇలాంటి కేసు చాలా అరుదుగా ఉంటాయని వైద్యులు తెలిపారు.

Rare PMDS Case: అబ్బాయి శరీరంలో గర్భాశయం.. పిల్లలు పుట్టట్లేదని హాస్పిటల్‌కు వెళ్లగా..
Infertility Leads To Shocking Uterus Discovery In Man

Updated on: Sep 11, 2026 | 9:28 AM

పిల్లలు పుట్టట్లేదని, ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకుందామని హాస్పిటల్‌కు వెళ్లిన ఓ యువకుడికి ఊహించని షాక్ తగిలింది. అతని శరీరంలో గర్బాషయం ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అతడు పురుషుడిగా జన్మించి, సాధారణ పురుష లక్షణాలు ఉన్నప్పటికీ.. అతని శరీరంలో మాత్రం గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్‌లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వైద్య రంగంలో దీనిని పర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిండ్రోమ్ (PMDS)గా అంటారని, ప్రపంచ వైద్య చరిత్రలోనే ఇలాంటి కేసులు 300 కంటే తక్కువగా ఉన్నాయని తెలిపారు.

పరీక్షల్లో వెలుగుచూసిన విస్తుపోయే నిజాలు

వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన 26 ఏళ్ల యువకుడికి ఈ మధ్య కాలంలో వివాహం జరిగింది. పెళ్లై కొంత కాలం గడుస్తున్నా పిల్లలు కలగకపోవడంతో, అసలు కారణం తెలుసుకునేందుకు దిల్లీ రాజౌరీ గార్డెన్‌లోని ఆర్‌జీ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా, వీర్యంలో శుక్రకణాలు లేవని బయటపడింది. అంతేకాదు, పుట్టుకతోనే అతని వృషణాలు బయటకు దిగకుండా శరీరం లోపలే ఉండిపోయినట్లు గుర్తించారు. దీనికి గల పూర్తి కారణాన్ని తెలుసుకునేందుకు వైద్యులు ఎంఆర్ఐ (MRI), జన్యు పరీక్షలు నిర్వహించారు.

ఈ టెస్ట్‌లో అతనికి 46, XY క్రోమోజోమ్‌లు ఉన్నప్పటికీ, కడుపు లోపల మాత్రం గర్భాశయ నిర్మాణాలు, ఫెలోపియన్ ట్యూబ్‌లు ఉన్నట్లు తేలింది. అవి కడుపులో అలాగే ఉండిపోతే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని గమనించిన వైద్యులు, లాపరోస్కోపిక్ సర్జరీ ద్వారా శరీరంలో ఉండిపోయిన రెండు వృషణాలతో పాటు గర్భాశయాన్ని విజయవంతంగా తొలగించారు. ఆపరేషన్ అనంతరం ఆ కణజాలాన్ని బయాప్సీకి పంపగా మరో షాకింగ్ విషయం వెలుగుచూసింది.

తప్పిన పెను ప్రమాదం

అతని ఎడమ వృషణంలో అప్పటికే క్యాన్సర్‌కు కారణమయ్యే జర్మ్ సెల్ నియోప్లాసియా ఇన్ సిటు కణాలు అభివృద్ధి చెందుతున్నట్లు తెలిసింది. సరైన సమయంలో ఆపరేషన్ జరగడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.అయితే నార్మల్‌గా ఇలాంటి సమస్యలు చిన్న వయస్సులోనే బయటపడుతాయి. కానీ ఈ యువకుడికి 26 ఏళ్ల వయస్సులో బయటపడడం అదురైన విషయం అని వైద్యులు తెలిపారు.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us