OPPO F27 Pro+: మిలటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో నయా ఫోన్ రిలీజ్ చేసిన ఒప్పో.. ధరెంతో తెలిస్తే షాక్

తాజాగా ప్రముఖ కంపెనీ అప్పో భారతదేశంలో అప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ 5 జీ స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ చేయడంతో అప్పో దేశంలో ఎఫ్ సిరీస్ స్మార్ట్ ఫోన్లను విస్తరించింది. మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో మొదటి ఎఫ్-సిరీస్ స్మార్ట్ ఫోన్‌గా నిలిచింది. అప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ 5జీ మీడియాటెక్ చిపెసెట్‌తో వస్తుంది.

OPPO F27 Pro+: మిలటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో నయా ఫోన్ రిలీజ్ చేసిన ఒప్పో.. ధరెంతో తెలిస్తే షాక్
Oppo F27 Pro+
Follow us

|

Updated on: Jun 15, 2024 | 5:45 PM

భారతదేశంలో ఇటీవల కాలంలో సూపర్ స్టార్ట్ ఫీచర్‌లతో అనేక స్మార్ట్ ఫోన్‌లు రిలీజ్ అవుతున్నాయి. అమెరికా, చైనా తర్వాత భారతదేశం అత్యధిక స్మార్ట్ ఫోన్‌లు అమ్ముడయ్యే దేశంగా ఉంది. ఈ మార్కెట్‌లో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని అనేక కంపెనీలు ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశ యువతను ఆకట్టుకునేలా అనేక ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ ఒప్పో భారతదేశంలో అప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ 5 జీ స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ చేయడంతో అప్పో దేశంలో ఎఫ్ సిరీస్ స్మార్ట్ ఫోన్లను విస్తరించింది. మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో మొదటి ఎఫ్-సిరీస్ స్మార్ట్ ఫోన్‌గా నిలిచింది. ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ 5జీ మీడియాటెక్ చిపెసెట్‌తో వస్తుంది. అలాగే ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకత. ఈ నేపథ్యంలో ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

అప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ 5జీ ఫోన్ ఐపీ66, ఐపీ 68, ఐపీ 69తో అత్యధిక స్థాయి ధూళి, నీటి నిరోధకత కలిగిన మూడు రేటింగ్‌లతో వస్తుంది. ఈ ప్రమాణాలు ప్రత్యేకంగా ఫోన్ అధిక-పీడనం, అధిక-ఉష్ణోగ్రత వాటర్ జెట్లను తట్టుకోగలదని, ఒకేసారి 30 నిమిషాల వరకు నీటి ఇమ్మర్షన్‌తో వస్తుంది. అలాగే ఈ ఫోన్ డ్యామేజ్ ప్రూఫ్ ఫీచర్‌తో వస్తుంది. అంటే 360-డిగ్రీ ఆర్మర్ బాడీ ప్రోటెక్షన్‌తో పాటు స్క్రీన్‌పై కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్-2తో వస్తుంది. అలాగే ఈ ఫోన్ 8జీబీ+ 128 జీబీ, 8 జీబీ +256జీబీ వేరియంట్స్‌తో వస్తుంది. ఈ ఫోన్ ధర రూ.27,999, రూ.29,999గా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ డస్క్ పింక్, మిడ్నైట్ నేవీ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ఫోన్ ఒప్పో ఇండియా ఇ-స్టోర్, అమెజాన్, ఇన్, ఫ్లిప్కార్ట్లో ప్రీ-ఆర్డర్ కోసం అధీకృత రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ విక్రయాలు జూన్ 20 నుంచి ప్రారంభం కానున్నాయి.

ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ కోసం కంపెనీ ఫాలో లాంచ్ ఆఫర్లను కూడా ప్రకటించింది. ప్రమాదవశాత్తూ లిక్విడ్ డ్యామేజ్‌కు వ్యతిరేకంగా 6 నెలల వరకు రూ. 1199 విలువైన వర్రీ-ఫ్రీ ప్రొటెక్షన్ ప్లాన్‌ను అందిస్తుంది. అలాగే ఎలాంటి డౌన్ పేమెంట్ లేకుండా 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐతో పాటు 9 నెలల వరకు వినియోగదారు రుణాలను అందిస్తున్నారు. అలాగే రూ.1000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు అప్పో కస్టమర్లు రూ. 1000 విలువైన అదనపు లాయల్టీ బోనస్ అందిస్తుంది. అప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ 1080×2412 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్ ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఎమోఎల్ఈడీ కర్వ్ స్క్రీన్ గరిష్టంగా 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 950 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.ఆక్టా-కోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ ఈ ఫోన్ ప్రత్యేకత. అలాగే 64 ఎంపీ ప్రధాన కెమెరా, 2ఎంపీ డెప్త్ సెన్సార్‌లతో పాటు 8 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో సపోర్ట్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌తో వస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అందాల పోటీల్లో ముందున్న ‘జారా’.. జారాది కళ్లు.. చెదిరే అందం.!
అందాల పోటీల్లో ముందున్న ‘జారా’.. జారాది కళ్లు.. చెదిరే అందం.!
పేరుకు కేంద్ర మంత్రి.. ఒక్క పదం రాయడం రాదట! ఓ లెవెల్‌లో ట్రోలింగ్
పేరుకు కేంద్ర మంత్రి.. ఒక్క పదం రాయడం రాదట! ఓ లెవెల్‌లో ట్రోలింగ్
ఎర్ర సముద్రంలో అరాచకం.. హౌతీ రెబెల్స్‌ మరో నౌకను ముంచేసారు.
ఎర్ర సముద్రంలో అరాచకం.. హౌతీ రెబెల్స్‌ మరో నౌకను ముంచేసారు.
రూ.10 వేలు పెట్టుబడి పెట్టి..రూ.10 కోట్లకు అధిపతులయ్యారు.!
రూ.10 వేలు పెట్టుబడి పెట్టి..రూ.10 కోట్లకు అధిపతులయ్యారు.!
షాకింగ్ ఘటన.. ఆలూ చిప్స్‌ ప్యాకెట్‌లో కుళ్లిన కప్ప.. వీడియో.
షాకింగ్ ఘటన.. ఆలూ చిప్స్‌ ప్యాకెట్‌లో కుళ్లిన కప్ప.. వీడియో.
స్నానానికి వెళ్లి బ్రెయిన్ ఈటింగ్‌ అమీబా వల్ల మృతి.
స్నానానికి వెళ్లి బ్రెయిన్ ఈటింగ్‌ అమీబా వల్ల మృతి.
దేశం దాటేందుకు వేషం మార్చ యువకుడి విఫలయత్నం.. చివరికి.?
దేశం దాటేందుకు వేషం మార్చ యువకుడి విఫలయత్నం.. చివరికి.?
చేయి తెగి రక్తమోడుతున్నా పట్టించుకోలేదు.. చివరికి ఏమైందంటే.!
చేయి తెగి రక్తమోడుతున్నా పట్టించుకోలేదు.. చివరికి ఏమైందంటే.!
టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే విమానంలో మంటలు..! వీడియో వైరల్..
టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే విమానంలో మంటలు..! వీడియో వైరల్..
చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక డెడ్ బాడీ..! వీడియో చూస్తే షాకే..
చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక డెడ్ బాడీ..! వీడియో చూస్తే షాకే..