మీ ఫోన్ హ్యాక్ అయినట్టు తెలుసుకోవడం ఎలా..?

TV9 Telugu

17 June 2024

మీ ఫోన్ హ్యాక్ అయితే చాలా మార్పులు చూడవచ్చని చెబుతున్నారు టెక్నాలజీ నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా, ఫోన్‌లోని బ్యాటరీ త్వరగా అయిపోవడం ప్రారంభమవుతుంది. తక్కువ వాడినా ఫోన్ త్వరగా వేడెక్కుతుంది.

మీ ఫోన్ డేటా మీరు ఉపయోగించకుండానే అయిపోయింది. అప్పుడు మీ మొబైల్ ప్రాబ్లెమ్ లో ఉందని వెంటనే తెలుసుకోవాలి.

మీ ఫోన్‌లో కొన్ని అనుమానాస్పద కార్యకలాపాలు మీకు తెలియకుండానే జరిగిపోతుంటాయని అంటున్నారు టెక్ నిపుణులు.

మీ ఫోన్‌లో మునుపటి కంటే ఎక్కువ నోటిఫికేషన్‌లు రావడం ప్రారంభమవుతాయి. అప్పుడు మొబైల్ హ్యాక్ అయిందని గుర్తించాలి.

మీ స్మార్ట్ ఫోన్ హ్యాక్ అయినట్టు అయితే మరిన్ని ప్రకటనలు, పాప్-అప్ సందేశాలు కనిపిస్తాయని నిపుణులు అంటున్నారు.

అలాంటి యాప్‌లు మీరు ఇన్‌స్టాల్ చేయని ఫోన్‌లో ఇన్‌స్టాల్ అవుతాయి. ఇవి అన్ని జరిగితే మీ ఫోన్ హ్యాక్ అయిందని తెలుసుకోవాలి.

ఫోన్ స్పీడ్ స్లో అవుతుంది. దీన్ని నివారించడానికి, వెంటనే ఫోన్‌లో సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయండి.