ఇన్ని స్పెషాలిటీస్​ ఉన్న స్మార్ట్​ఫోన్​ వస్తుందని ఊహించలేరు… Oneplus 16, 16R గురించి తెలుసా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ OnePlus భారత మార్కెట్లో మరోసారి ప్రీమియం విభాగంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా OnePlus 16, OnePlus 16R పేర్లతో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో OnePlus 16R మాత్రమే భారత్‌లో లాంచ్ అవుతుందని అంచనాలు ఉండగా.. తాజాగా లీకైన నివేదికలు రెండు మోడళ్ల రాకకు సంబంధించిన ఆసక్తిని పెంచాయి. అయితే ఈ ఫోన్ల లాంచ్‌పై కంపెనీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇన్ని స్పెషాలిటీస్​ ఉన్న స్మార్ట్​ఫోన్​ వస్తుందని ఊహించలేరు... Oneplus 16, 16R గురించి తెలుసా
Oneplus 16 Series .jpg

Updated on: Nov 08, 2026 | 8:50 PM

OnePlus 16 ప్రారంభ ధర రూ. 1.30 లక్షల నుంచి రూ. 1.40 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే నిజమైతే కంపెనీ చరిత్రలో అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌గా నిలిచే అవకాశం ఉంది. ఇక OnePlus 16R ధర సుమారు రూ. 70,000 నుంచి రూ. 75,000 మధ్య ఉండవచ్చని సమాచారం. లీకైన వివరాల ప్రకారం ఈ రెండు ఫోన్లలోనూ అధునాతన ఫీచర్లు ఉండనున్నాయి.

ఫీచర్లు, కెమెరా వివరాలు

OnePlus 16లో 6.78 అంగుళాల LTPO OLED డిస్‌ప్లే, 165Hz రిఫ్రెష్ రేట్ ఉండే అవకాశం ఉంది. ఇందులో Snapdragon 8 Elite Extreme ప్రాసెసర్‌ను అందించవచ్చని తెలుస్తోంది. కెమెరా విభాగంలో OIS వివరాలు వెల్లడికాకపోయినప్పటికీ.. 200MP ప్రధాన కెమెరాతో పాటు 50MP అల్ట్రావైడ్, 50MP టెలిఫోటో కెమెరాలు ఉండవచ్చని అంచనా. సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఇవ్వనున్నట్లు సమాచారం.

బ్యాటరీ, ఛార్జింగ్ ప్రత్యేకతలు

OnePlus 16లో 9,000mAh భారీ బ్యాటరీ, 100W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండవచ్చని తెలుస్తోంది. వైర్డ్ ఛార్జింగ్‌తో 37 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ అవుతుందని లీకులు సూచిస్తున్నాయి. మరోవైపు OnePlus 16Rలో Snapdragon 8 Elite ప్రాసెసర్, 165Hz డిస్‌ప్లే, 200MP ప్రధాన కెమెరాతో పాటు 3.5x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండే అవకాశం ఉంది. ఈ మోడల్‌లో 7,500mAh నుంచి 9,000mAh వరకు బ్యాటరీని అందించవచ్చని అంచనా. అయితే ధరలు, ఫీచర్లు, లాంచ్ తేదీపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us