లుక్‌తోపాటు భారీ మార్పులతో TVS Radeon.. ధరతోపాటు ఫీచర్లలోనూ ఇన్ని ట్విస్ట్‌లా?

బడ్జెట్ ధరలో మంచి మైలేజీ ఇచ్చే బైక్‌ కోసం చూస్తున్నారా? అయితే TVS మోటార్ తీసుకొచ్చిన కొత్త TVS Radeon 2026 మీకు ఆసక్తికరమైన ఎంపిక కావచ్చు. పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ 110cc బైక్‌లో కంపెనీ కొత్త అప్‌డేట్స్‌ అందించింది. ముఖ్యంగా ఆల్ LED లైటింగ్‌, కొత్త కలర్ ఆప్షన్లు దీని ప్రత్యేకతగా నిలుస్తున్నాయి.

లుక్‌తోపాటు భారీ మార్పులతో TVS Radeon.. ధరతోపాటు ఫీచర్లలోనూ ఇన్ని ట్విస్ట్‌లా?
New Tvs Radeon 2026

Updated on: Oct 14, 2026 | 8:00 AM

తక్కువ ధరలో రోజువారీ ప్రయాణాలకు అనువైన బైక్‌లకు భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో TVS మోటార్ తన Radeon 110cc మోడల్‌ను కొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేసింది. 2026 TVS Radeon ప్రారంభ ధర రూ.67,100గా ఉంది. మూడు వేరియంట్లలో లభించే ఈ బైక్‌ ఫీచర్లు, ఇంజన్‌ వివరాలు, మైలేజీపై ఓ లుక్కేద్దాం.

ఆల్ LED లైటింగ్‌తో కొత్త లుక్‌..

2026 TVS Radeonలో ప్రధానంగా లైటింగ్ వ్యవస్థను అప్‌డేట్ చేశారు. సిగ్నేచర్ DRLతో కూడిన LED హెడ్‌లైట్‌, LED టెయిల్‌లైట్‌, LED టర్న్ ఇండికేటర్లను అందించారు. ఈ ఫీచర్లు అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా ఉంటాయని సమాచారం. బైక్‌ మొత్తం డిజైన్‌లో పెద్దగా మార్పులు చేయకపోయినా, కొత్త కలర్ ఆప్షన్లతో ఫ్రెష్ లుక్‌ తీసుకొచ్చారు.

ధరల విషయానికి వస్తే.. కొత్త TVS Radeon మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. బేస్ వేరియంట్ ధర రూ.67,100 కాగా, డిజి-డ్రమ్ వేరియంట్ ధర రూ.70,100గా ఉంది. టాప్ డిజి-డిస్క్ వేరియంట్‌ను రూ.73,100కు కొనుగోలు చేయవచ్చు. పాత మోడల్‌తో పోలిస్తే బేస్ వేరియంట్ ధర రూ.1,250 పెరిగినట్లు, టాప్ డిజి-డిస్క్ వేరియంట్ ధర రూ.7,500 తగ్గినట్లు వివరాలు సూచిస్తున్నాయి.

కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే.. బేస్ మోడల్ బ్లాక్ అండ్ బ్లూ, బ్లాక్ అండ్ రెడ్ రంగుల్లో లభిస్తుంది. డిజి-డ్రమ్ వేరియంట్‌లో బ్లాక్ అండ్ రెడ్, బ్లాక్ అండ్ ఆరెంజ్, రెడ్ అండ్ బ్లాక్ DT రంగులు ఉన్నాయి. టాప్ డిజి-డిస్క్ వేరియంట్‌లో బ్లాక్ అండ్ ఆరెంజ్, రెడ్ అండ్ బ్లాక్ DT కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

ఇంజన్‌ పాతదే..

కొత్త TVS Radeon 2026లో ఇంజన్‌ పరంగా మార్పులు చేయలేదు. ఇందులో పాత 110cc ఎయిర్/ఆయిల్ కూల్డ్ ఇంజన్‌నే కొనసాగించారు. ఈ ఇంజన్‌ గరిష్ఠంగా 8hp పవర్‌, 8.7Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 4-స్పీడ్ గేర్‌బాక్స్‌ జత చేశారు. మైలేజీ విషయానికి వస్తే.. ఈ బైక్‌ లీటర్‌కు సుమారు 63 నుంచి 74 కిలోమీటర్ల వరకు ఇంధన సామర్థ్యాన్ని అందించవచ్చని సమాచారం.

అయితే వాస్తవ మైలేజీ రైడింగ్ స్టైల్‌, ట్రాఫిక్‌, రోడ్డు పరిస్థితులను బట్టి మారుతుంది. ఇందులో 10 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌ ఉంది. ఫీచర్ల పరంగా USB ఛార్జింగ్‌, కలర్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌, డిస్క్ బ్రేక్ ఆప్షన్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఈ విభాగంలో Honda Livo, Bajaj CT 110X, Bajaj Platina 110 వంటి బైక్‌లతో TVS Radeon పోటీపడుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us