Hammer Fit Plus: మార్కెట్‌లో నయా స్మార్ట్ వాచ్ లాంచ్.. తక్కువ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు

|

Jun 15, 2023 | 4:30 PM

తాజాగా ప్రముఖ స్మార్ట్ వాచ్ తయారీ సంస్థ హామర్ కొత్త స్మార్ట్ వాచ్‌తో మన ముందుకు వచ్చింది. ముఖ్యంగా నాయిస్ కంపెనీల స్మార్ట్ వాచ్‌లకు పోటీగా ఈ స్మార్ట్ వాచ్ నిలవనుంది. హామర్ ఫిట్ ప్లస్ పేరుతో రిలీజ్ చేసిన ఈ స్మార్ట్ వాచ్ ధర రూ.2399గా ఉంది. ఈ స్మార్ట్ వాచ్ కంపెనీ వెబ్‌సైట్ నుంచి జూన్ 12 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంది.

Hammer Fit Plus: మార్కెట్‌లో నయా స్మార్ట్ వాచ్ లాంచ్.. తక్కువ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు
Hammer Fit Plus
Follow us on

యువత ప్రస్తుత రోజుల్లో ఎక్కువ స్మార్ట్ వాచ్‌లను వినియోగిస్తున్నారు. స్మార్ట్ వాచ్ మార్కెట్‌లో స్టార్టప్ కంపెనీల నుంచి టాప్ కంపెనీల వరకూ తమ మోడల్స్ స్మార్ట్ వాచ్‌లను రిలీజ్ చేస్తున్నాయి. సాంప్రదాయ వాచ్‌లను భిన్నంగా అధునాతన ఫీచర్లతో ఈ స్మార్ట్ వాచ్‌లు అందుబాటులో ఉంటున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం స్మార్ట్ వాచ్‌ల్లో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ అనేది కచ్చితంగా ఉంటున్నాయి. అలాగే ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి అప్ డేట్స్ కూడా స్మార్ట్ వాచ్‌లు అందిస్తుండడంతో చాలా మంది స్మార్ట్ వాచ్‌ల ఉపయోగానికి ముందుకు వస్తున్నారు. అయితే చాలా కంపెనీలు ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్‌తో స్మార్ట్ వాచ్‌లు రిలీజ్ చేస్తుండడంతో వినియోగదారులకు ఏ స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలో? అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే ఎప్పటికప్పుడు కొత్త కంపెనీలు సూపర్ ఫీచర్స్‌తో స్మార్ట్ వాచ్‌లు రిలీజ్ చేస్తుండడంతో యువత ఎక్కువగా స్టార్టప్ కంపెనీల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ధర నేపథ్యంలోనే ఎక్కువ మంది యువత స్మార్ట్ వాచ్‌ల మోడల్స్‌పై మక్కువ చూపుతున్నారు. తక్కువ ధరకు అధిక ఫీచర్లను అందించే స్మార్ట్ వాచ్‌ల కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. తాజాగా ప్రముఖ స్మార్ట్ వాచ్ తయారీ సంస్థ హామర్ కొత్త స్మార్ట్ వాచ్‌తో మన ముందుకు వచ్చింది. ముఖ్యంగా నాయిస్ కంపెనీల స్మార్ట్ వాచ్‌లకు పోటీగా ఈ స్మార్ట్ వాచ్ నిలవనుంది. హామర్ ఫిట్ ప్లస్ పేరుతో రిలీజ్ చేసిన ఈ స్మార్ట్ వాచ్ ధర రూ.2399గా ఉంది. ఈ స్మార్ట్ వాచ్ కంపెనీ వెబ్‌సైట్ నుంచి జూన్ 12 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంది. తక్కువ ధరకే అధిక ఫీచర్లను అందించే ఈ స్మార్ట్ వాచ్ అధిక ఫీచర్లపై ఓలుక్కేద్దాం.

సరికొత్త హామర్ ఫిట్ ప్లస్ స్మార్ట్ వాచ్ 1.85 అంగుళాల పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ వాచ్‌లో 500 నిట్‌ల గరిష్ట ప్రకాశం అందుబాటులో ఉంది. అలాగే కాల్ చేయడానికి బ్లూటూత్ సపోర్ట్, బిల్ట్-ఇన్ స్పీకర్, మైక్రోఫోన్‌తో ఆకర్షణీయంగా ఉంది. అలాగే ఈ స్మార్ట్ వాచ్‌లో నిద్ర, హృదయ స్పందన ట్రాకింగ్ వంటి ఫీచర్లను కంపెనీ అందించింది. రక్తపోటు, రక్త ఆక్సిజన్, ఋతు చక్రం గుర్తించడానికి వీలుగా ఇందులో సెట్టింగ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ వాచ్ పాస్‌వర్డ్, డేటా రక్షితంగా రూపొందించారు.  అలాగే హామర్ యాప్‌లో ద్వారా ఈ స్మార్ట్ వాచ్‌లో ఉన్న జీపీఎస్ సౌకర్యంతో వాచ్ ఎక్కడ ఉన్నా సింపుల్‌గా కనిపెట్టవచ్చు.

ముఖ్యంగా ఈ వాచ్‌లో ఉన్న ఫైండ్ మై వాచ్ ఫీచర్ ద్వారా ఫోన్ యాప్ వాచ్‌ను ట్రాక్ చేయవచ్చు. అలాగే ఈ వాచ్‌ మెటాలిక్ బాడీతో వస్తుంది. ఈ వాచ్ ఐపీ 67 వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది వేరు చేయగలిగిన సిలికాన్ స్ట్రిప్‌తో పాటు 4 వాచ్ ఫేస్‌లతో పాటు 100 కంటే ఎక్కువ వాల్‌పేపర్‌లను కలిగి యువతను అధికంగా ఆకట్టుకుంటుంది అలాగే ఈ స్మార్ట్ వాచ్‌లో అలారం, కాలిక్యులేటర్, స్టాప్‌వాచ్, యాంబియంట్ సౌండ్, డీఎన్‌డీ, టార్చ్, థియేటర్ మోడ్ వంటి ఫీచర్లతో వస్తుంది. ముఖ్ంయగా గూగుల్ వాయిస్ అసిస్టెంట్, పవర్ సేవింగ్ మోడ్ ఈ వాచ్‌కు అదనపు ఆకర్షణలుగా ఉంటాయి. ఈ వాచ్ బ్యాటరీ 2 నుండి 3 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..