Motorola G37 Power: భారీ బ్యాటరీ, ప్రీమియం డిజైన్‌తో ఈ మొబైల్ యూజర్లను మెప్పిస్తోందా

మోటోరోలా తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ 'G37 పవర్' ధరను రూ. 6,000 వరకు పెంచింది. మొదట్లో రూ. 15,999 కి విడుదలైన ఈ ఫోన్, ఇప్పుడు పెరిగిన ధరతో రూ. 18,999 నుండి అందుబాటులో ఉంది. అయితే, ఈ ధర పెంపు తర్వాత మార్కెట్లో ఉన్న ఇతర పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే ఇది ఎంతవరకు నిలబడుతుందో వివరంగా తెలుసుకుందాం!

Motorola G37 Power: భారీ బ్యాటరీ, ప్రీమియం డిజైన్‌తో ఈ మొబైల్ యూజర్లను మెప్పిస్తోందా
Motorola G37.jpg

Updated on: Jun 21, 2026 | 7:00 AM

7000mAh భారీ బ్యాటరీ, ప్రీమియం డిజైన్ ఈ ఫోన్ యొక్క ప్రధాన బలాలు. కానీ, అదే ధరలో ఇతర బ్రాండ్లు అద్భుతమైన AMOLED డిస్‌ప్లేలు, వేగవంతమైన ప్రాసెసర్లు అందిస్తుంటే, మోటోరోలా మాత్రం పాత ఫీచర్లకే పరిమితమైంది. ధర పెరిగిన తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయడం లాభదాయకమేనా? లేక ఇతర ప్రత్యామ్నాయాలు మెరుగ్గా ఉన్నాయా?

డిజైన్, బిల్డ్ క్వాలిటీ

మోటోరోలా ఎప్పటిలాగే తన సిగ్నేచర్ డిజైన్ లాంగ్వేజ్‌ను కొనసాగించింది. వెగాన్ లెదర్ బ్యాక్ మరియు నాటికల్ బ్లూ కలర్ ఈ ఫోన్‌కు ప్రీమియం లుక్‌ని ఇస్తాయి. ఇది MIL-STD-810H ప్రొటెక్షన్‌తో చాలా దృఢంగా ఉన్నప్పటికీ, 215 గ్రాముల బరువు ఉండటం వల్ల ఎక్కువ సేపు చేతిలో ఉంచుకోవడం ఇబ్బందిగా అనిపిస్తుందని యూజర్స్ అభిప్రాయపడుతున్నారు. Vivo T5x వంటి ఇతర ఫోన్లతో పోలిస్తే దీని వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ చాలా తక్కువని అంటున్నారు.

బ్యాటరీ, ఛార్జింగ్

ఈ ఫోన్‌కు అతిపెద్ద ప్లస్ పాయింట్ 7,000mAh బ్యాటరీ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా సులభంగా వస్తుంది. కానీ, ఇక్కడే ఒక చిక్కు ఉంది. 30W ఫాస్ట్ ఛార్జర్ ద్వారా ఈ బ్యాటరీని పూర్తిగా నింపడానికి ఎక్కువ సమయం తీసుకుంటోందని, ప్రస్తుత కాలంలో చాలా నెమ్మదిగా అనిపిస్తుందని అంటున్నారు.

డిస్‌ప్లే, పర్ఫార్మెన్స్

ధర పెరిగిన తర్వాత కూడా మోటోరోలా ఇందులో HD+ LCD ప్యానెల్‌నే వాడింది. అలాగే, మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్ పనితీరు, అదే ధరలో లభించే ఇతర ఫోన్ల (డైమెన్సిటీ 7400)తో పోలిస్తే చాలా బలహీనంగా ఉందట. గేమింగ్ మరియు మల్టీ టాస్కింగ్‌లో ఈ ఫోన్ తరచుగా స్టట్టరింగ్ సమస్యలను ఎదుర్కొంటుందిని తెలుస్తోంది.

సాఫ్ట్‌వేర్, కెమెరా

ఆండ్రాయిడ్ 16 బేస్డ్ ‘హలో UI’తో వచ్చిన ఈ ఫోన్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల విషయంలో కేవలం ఒకే ఒక్క అప్‌డేట్‌కు మాత్రమే పరిమితమైందని టెక్ నిపుణులు చెబుతున్నారు. కెమెరా క్వాలిటీ సాధారణ వెలుతురులో బాగున్నా, తక్కువ కాంతిలో (Low-light) మాత్రం వివరాలు సరిగ్గా రావడం లేదని టాక్.

Follow Us