
తక్కువ ధరలో మంచి ధ్వని, ఎక్కువ బ్యాటరీ, స్పష్టమైన కాలింగ్ కోరుకునే వారికి Motorola కొత్త ఇయర్‌బడ్స్ ఆసక్తికరంగా మారనున్నాయి. Moto Buds 2 Fusion పేరుతో వస్తున్న ఈ మోడల్‌లో 55dB వరకు నాయిస్ క్యాన్సిలేషన్, 6 మైక్రోఫోన్లు, 53 గంటల బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. మూడు ఆకర్షణీయమైన రంగుల్లో ఇవి మార్కెట్లోకి రానున్నాయి.
Moto Buds 2 Fusionను Pantone Top Shoe, Pantone Laurel, Pantone Surf The Web అనే మూడు రంగుల్లో తీసుకొస్తున్నారు. ఎక్కువసేపు చెవుల్లో పెట్టుకున్నా సౌకర్యంగా ఉండేలా వీటిని రూపొందించారు. సంగీత ప్రియుల కోసం 12.4mm టైటానియం కోటెడ్ డైనమిక్ డ్రైవర్లను అందించారు. Motorola ప్రత్యేక ఆడియో ట్యూనింగ్‌తో పాటలు మరింత స్పష్టంగా వినిపించే అవకాశం ఉంది.
బయటి శబ్దం వల్ల సంగీతానికి అంతరాయం కలగకుండా 55dB వరకు నాయిస్ క్యాన్సిలేషన్ సౌకర్యం ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇయర్‌బడ్స్ 13 గంటల వరకు పనిచేస్తాయి. ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 53 గంటల బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 3 గంటల వరకు సంగీతం వినొచ్చని కంపెనీ చెబుతోంది.
Moto Buds 2 Fusionలో ఒక్కో ఇయర్‌బడ్స్‌కు మూడు చొప్పున మొత్తం 6 మైక్రోఫోన్లు ఉన్నాయి. CrystalTalk AI సాంకేతికత ద్వారా బ్యాక్‌గ్రౌండ్ శబ్దాన్ని తగ్గించి స్పష్టమైన వాయిస్ అందించేలా రూపొందించారు. Bluetooth 6.0 సపోర్ట్‌తో ఫోన్, ల్యాప్‌టాప్ వంటి పరికరాలకు వేగంగా అనుసంధానం అవుతాయి. ఆటోమేటిక్ స్విచింగ్ ద్వారా పలు పరికరాల మధ్య సులభంగా మారవచ్చు.
Wear Detection, Touch Controls, Spatial Audio వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP54 రేటింగ్ లభించింది. Moto Buds 2 Fusion సెప్టెంబర్ 15న భారత్‌లో విడుదల కానుంది. Flipkartతో పాటు Motorola అధికారిక వెబ్‌సైట్‌లో విక్రయాలు జరగనున్నాయి. ధర ఎంతనేది మాత్రం అదే రోజు వెల్లడయ్యే అవకాశం ఉంది.