
మీరు ఈ నెలలో కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ బడ్జెట్‌కు ఇది ఒక సువర్ణావకాశం. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాలైన మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్ కంపెనీలు జూన్ 2026 ఆఫర్లలో భాగంగా తమ వాహనాలపై కళ్లు చెదిరే భారీ డిస్కౌంట్లను ప్రకటించాయి. కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ ఇన్సెంటివ్స్, కార్పొరేట్ బెనిఫిట్స్ రూపంలో ఈ ఆఫర్లను అందిస్తున్నాయి. దీనివల్ల ఎంపిక చేసిన మోడళ్లపై గరిష్టంగా రూ.2.15 లక్షల వరకు నేరుగా ఆదా చేసుకునే వీలుంది. ఈ అదిరిపోయే ఆఫర్లు జూన్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఏయే కంపెనీ ఏ మోడల్‌పై ఎంత తగ్గింపు ఇస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం.
ఈ జూన్ నెలలో మారుతి సుజుకి తన ప్రీమియం నెక్సా సిరీస్ కార్లపైనే దేశంలోనే అతిపెద్ద తగ్గింపులను ఇస్తోంది.
మారుతి ఇన్విక్టో : ఈ లగ్జరీ ఎమ్‌పీవీపై గరిష్టంగా రూ.2.15 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఈ నెలలో ఆటోమొబైల్ రంగంలో లభిస్తున్న బిగ్గెస్ట్ డిస్కౌంట్ ఇదే కావడం విశేషం.
గ్రాండ్ విటారా : పెట్రోల్ వేరియంట్లపై రూ.85,000 నుండి రూ.1.35 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఒకవేళ ఢిల్లీలో రోడ్ టాక్స్ మినహాయింపు, ఎక్స్‌టెండెడ్ వారంటీతో కూడిన స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ తీసుకుంటే మొత్తం రూ.1.85 లక్షల వరకు లబ్ధి చేకూరుతుంది.
ఇతర మోడల్స్: ఇగ్నిస్, బాలెనో, ఎక్స్ XL6, జిమ్నీ కార్లపై రూ.40,000 నుండి రూ.45,000 వరకు, అలాగే ఫ్రాంక్స్‌పై రూ.25,000 వరకు డిస్కౌంట్లు ఉన్నాయి.
హ్యుందాయ్ తన మోస్ట్ పాపులర్ ఎస్‌యూవీ అయిన క్రెటా, సెడాన్ వెర్నా లపై క్రేజీ ఆఫర్లను మార్కెట్లోకి తెచ్చింది.
క్రెటా: సెలెక్టెడ్ పెట్రోల్ వేరియంట్లపై కస్టమర్లు రూ.1 లక్ష వరకు ఆదా చేసుకోవచ్చు. కాగా క్రెటా ఈవీపై రూ.85,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి.
వెర్నా: ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్‌పై రూ.95,000 వరకు, సరికొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌పై రూ.55,000 వరకు ఆఫర్లు లభిస్తున్నాయి.
ఇతర మోడల్స్: గ్రాండ్ i10 నియోస్‌పై రూ.78,000, అల్కాజర్‌పై రూ.75,000, i20 & i20 ఎన్ లైన్‌పై రూ.63,000, ఎక్స్‌టర్‌పై రూ.43,000 వరకు ఆదా చేయవచ్చు. అలాగే ఆరాపై రూ.25,000, వెన్యూపై రూ.5,000 స్క్రాపేజ్ బెనిఫిట్స్ ఉన్నాయి.
టాటా మోటార్స్ సైతం తన 2026 మోడల్ ఇయర్ కార్లు, SUVలపై అద్భుతమైన డిస్కౌంట్లతో పోటీ పడుతోంది. అయితే ఈ ఆఫర్లు పంచ్, టియాగో ఫేస్‌లిఫ్ట్ మోడళ్లకు వర్తించవు.
నెక్సాన్ – కర్వ్ : టాటా నెట్వర్క్‌లో అత్యంత ఆదరణ పొందుతున్న ఈ రెండు మోడళ్లపై గరిష్టంగా రూ.55,000 వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
హారియర్ – సఫారీ: ఈ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీల డీజిల్ వేరియంట్లను కొనుగోలు చేసే వారికి రూ.45,000 వరకు తగ్గింపు లభిస్తుంది.
ఇతర మోడల్స్: ఆల్ట్రోజ్‌పై రూ.40,000 వరకు, టియాగోపై రూ.35,000, టిగోర్‌పై రూ.30,000 వరకు ఆదా చేసుకునే ఛాన్స్ ఉంది.