Telugu News Technology Jio Announces New Recharge Plan, rs.866 plan Swiggy One Line Subscription with Daily Data, Jio Plans details in telugu
Jio Plans: సరికొత్త రీచార్జ్ ప్లాన్ ప్రకటించిన జియో.. డైలీ డేటాతో పాటు స్విగ్గీ వన్ లైన్ సబ్‌స్క్రిప్షన్
జియో రూ. 866 ధరతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ సరికొత్త ప్లాన్‌లో స్విగ్గీ వన్ లైట్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఆఫర్ చేస్తుంది. వినియోగదారులు ఈ యాప్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసినప్పుడు వారు ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు. జియో ప్రతినిధులు చెబుతున్న ప్రకారం ఈ ప్లాన్ ద్వారా జియో ప్రీపెయిడ్ కస్టమర్‌లు నిరంతరాయంగా కమ్యూనికేషన్‌ను పొందవచ్చు.
టెలికాం రంగంలో పెరిగిన పోటీ నేపథ్యంలో కొత్త కస్టమర్లను ఆకర్షించే లక్ష్యంతో రిలయన్స్ జియో రూ. 866 ధరతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ సరికొత్త ప్లాన్‌లో స్విగ్గీ వన్ లైట్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఆఫర్ చేస్తుంది. వినియోగదారులు ఈ యాప్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసినప్పుడు వారు ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు. జియో ప్రతినిధులు చెబుతున్న ప్రకారం ఈ ప్లాన్ ద్వారా జియో ప్రీపెయిడ్ కస్టమర్‌లు నిరంతరాయంగా కమ్యూనికేషన్‌ను పొందవచ్చు. ఆహారం, కిరాణా సామగ్రి, మరిన్నింటి కోసం స్విగ్గీకు సంబంధించిన ఆన్-డిమాండ్ ఉచిత డెలివరీకి యాక్సెస్ పొందవచ్చు. జియో సరికొత్త ప్లాన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
జియో రూ.866 ప్లాన్ ప్రయోజనాలు
జియో కొత్త రూ. 866 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రతిరోజూ 2 జీబీ 5జీ డేటాను అందిస్తుంది.
డేటాతో పాటు కొత్త ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్ ప్రయోజనాలను పొందవచ్చు.
జియో రూ.866 ప్లాన్ 84 రోజుల వాలిడిటీని అందిస్తుంది.
జియోకు సంబంధించిన స్వాగత ఆఫర్‌లో భాగంగా వినియోగదారులు అపరిమిత 5G డేటాను కూడా పొంవచ్చు.
ఈ ప్లాన్ ద్వారా మూడు నెలల స్విగ్గీ వన్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. సాధారణంగా స్విగ్గీ వన్ లైట్ సబ్‌స్క్రిప్షన్ విలువ రూ. 600. కొత్త రూ. 866 ప్రీపెయిడ్ ప్లాన్‌తో దీన్ని ఉచితంగా పొందవచ్చు.
స్విగ్గీ వన్ లైట్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా రూ. 149 కంటే ఎక్కువ ఆహార ఆర్డర్‌ల కోసం వినియోగదారులు 10 ఉచిత హోమ్ డెలివరీలను ఆస్వాదించవచ్చు.
ఇన్‌స్టామార్ట్ రూ. 199 కంటే ఎక్కువ ఆర్డర్‌ల కోసం వినియోగదారులు 10 ఉచిత హోమ్ డెలివరీలను కూడా పొందవచ్చు.
రద్దీ సమయాల్లో కూడా ఆహారం, ఇన్‌స్టామార్ట్ డెలివరీలు రెండింటికీ అదనపు ఛార్జీలు ఉండవు.
ముఖ్యంగా 20,000 కంటే ఎక్కువ రెస్టారెంట్‌లలో వారి సాధారణ ఆఫర్‌ల పైన 30 శాతం వరకు అదనపు తగ్గింపులను పొందవచ్చు.
రూ. 60 కంటే ఎక్కువ ఉన్న జెనీ డెలివరీలు 10 శాతం తగ్గింపుతో వస్తాయి.