జపాన్ లో జెయింట్ రోబో ‘టెస్టింగ్’ చూడాల్సిందే !

జపాన్ లోని యొకహామా సిటీలో ఓ బ్రహ్మాండమైన రోబో అందర్నీ ఇట్టే ఆకర్షిస్తోంది. 1970 ప్రాంతం నాటి పాపులర్ టీవీ సీరీస్ ' మొబైల్ సూట్ గుండమ్' లో ప్రదర్శించిన రోబో తరహాలాంటిదే ఇది కూడా ! ఈ భారీ రోబో మెల్లగా అడుగులు వేయగలదు..

జపాన్ లో జెయింట్ రోబో టెస్టింగ్ చూడాల్సిందే !

Edited By:

Updated on: Sep 24, 2020 | 4:17 PM

జపాన్ లోని యొకహామా సిటీలో ఓ బ్రహ్మాండమైన రోబో అందర్నీ ఇట్టే ఆకర్షిస్తోంది. 1970 ప్రాంతం నాటి పాపులర్ టీవీ సీరీస్ ‘ మొబైల్ సూట్ గుండమ్’ లో ప్రదర్శించిన రోబో తరహాలాంటిదే ఇది కూడా ! ఈ భారీ రోబో మెల్లగా అడుగులు వేయగలదు.. మోకాళ్ళు వంచగలదు..చేతులు పైకి లేపి సైగలు చేయగలదు  కూడా.. దీన్ని అధికారులు ఇటీవల టెస్ట్ చేసి  వీడియోను  కూడా విడుదల చేశారు. 60 అడుగుల ఎత్తు, 24 టన్నుల బరువున్న దీన్ని స్టీల్, కార్బన్ ఫైబర్ ప్లాస్టిక్ నుంచి సుమారు 200 ముక్కలతో క్రియేట్ చేశారట. అన్నట్టు క్లాసిక్ ‘ఎనిమీ’ సిరీస్ లోని ఓ క్యారక్టర్ ఆధారంగా కూడా ఈ రోబోను సృష్టించారని అంటున్నారు.