గేమర్ల కోసం అదిరే ట్యాబ్లెట్ తెచ్చిన ఐకూ.. డిస్ ప్లే, డిజైన్, బ్యాటరీ సూపర్

ప్రముఖ టెక్ బ్రాండ్ ఐకూ కొత్త iQOO Pad Ultra ట్యాబ్లెట్‌ను అధికారికంగా విడుదల చేసింది. iQOO 16 స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఈ ట్యాబ్లెట్‌ను చైనా మార్కెట్లో తీసుకొచ్చింది. సన్నని డిజైన్‌తో పాటు ఫ్లాగ్‌షిప్ స్థాయి ప్రాసెసర్, 165Hz OLED డిస్‌ప్లే, భారీ బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ సిస్టమ్‌ వంటి ప్రత్యేక ఫీచర్లను ఇందులో అందించారు. గేమింగ్‌ను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందించారు.

గేమర్ల కోసం అదిరే ట్యాబ్లెట్ తెచ్చిన ఐకూ.. డిస్ ప్లే, డిజైన్, బ్యాటరీ సూపర్
Iqoo Pad Ultra

Updated on: Oct 03, 2026 | 7:10 AM

కేవలం 5.74 మిల్లీమీటర్ల మందంతో ఉండే ఈ ట్యాబ్లెట్‌లో 8.8 అంగుళాల 2.3K OLED స్క్రీన్ ఉంది. గరిష్ఠంగా 4,500 నిట్స్ బ్రైట్‌నెస్ అందించే డిస్‌ప్లేకు 165Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. మరోవైపు 9,020mAh బ్యాటరీతో పాటు 66W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. ప్రస్తుతం చైనాలో ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి.

165Hz OLED స్క్రీన్..

ఈ ట్యాబ్లెట్‌లో 1440×2304 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 8.8 అంగుళాల OLED డిస్‌ప్లే ఉంది. సన్నని బెజెల్స్ కారణంగా స్క్రీన్-టు-బాడీ రేషియో 93.3 శాతంగా ఉంది. 165Hz రిఫ్రెష్ రేట్, 1 మిల్లీసెకన్‌ కంటే తక్కువ రెస్పాన్స్ టైమ్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి సదుపాయాలు ఉన్నాయి. వెనుక కెమెరా మాడ్యూల్‌లో RGB లైటింగ్ ఇచ్చారు. ఇందులో ఆరు రకాల విజువల్ ఎఫెక్ట్స్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు.

పనితీరు కోసం 2nm Snapdragon 8 Elite Extreme Gen 6 మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు. CPU క్లాక్ స్పీడ్ 5.0GHz వరకు ఉంటుంది. Adreno 850 GPU, Q4 గేమింగ్ చిప్‌తో పాటు Monster Over Core Engine, హార్డ్‌వేర్ షెడ్యూలర్ కూడా ఉన్నాయి.

9,020mAh బ్యాటరీ

భారీ గేమ్స్ ఆడే సమయంలో వేడిని నియంత్రించేందుకు “ఐస్ డోమ్ ఫైవ్ ఫోల్డ్ ఎయిర్ కూలింగ్ సిస్టం”ను అందించారు. ఇందులో 30×30×3.5 మిల్లీమీటర్ల యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ ఉంటుంది. ఇది గరిష్ఠంగా 0.94 CFM గాలి ప్రవాహాన్ని అందిస్తుంది. ఉష్ణోగ్రత ఆధారంగా గాలి ప్రవాహాన్ని మూడు స్థాయిల్లో ఆటోమేటిక్‌గా మార్చుతుంది. రెండు X-యాక్సిస్ లీనియర్ మోటార్లతో 4D టాక్టైల్ వైబ్రేషన్, 15 ప్రముఖ గేమ్స్‌కు సపోర్ట్ ఉన్నాయి. PC ఎమ్యులేటర్ ద్వారా కొన్ని AAA PC గేమ్స్‌ను టాబ్లెట్‌లో స్థానికంగా రన్ చేసుకునే అవకాశం ఉంది. Android 17 ఆధారిత OriginOS 7 HDపై పనిచేస్తుంది.

9,020mAh బ్యాటరీకి 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 12GB + 256GB వేరియంట్ ధర 6,499 యువాన్లు కాగా, 16GB + 256GB ధర 7,199 యువాన్లు. 16GB + 512GB ధర 7,999 యువాన్లు, 16GB + 1TB ధర 8,999 యువాన్లు. భారత కరెన్సీలో సుమారు రూ.92,965 నుంచి రూ.1,28,725 వరకు ఉంటాయి. అధికారిక విక్రయాలు అక్టోబర్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us