Instagram: ఇన్‌స్టాలో మరో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఇకపై కామెంట్‌ సెక్షన్‌లో..

|

Oct 21, 2023 | 5:21 PM

యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తున్న ఇన్‌స్టాగ్రామ్‌ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఇన్‌స్టాగ్రామ్‌ కామెంట్ సెక్షన్‌లో పోల్స్‌ ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఏదైనా ఒక అంశంపై పోల్స్‌ నిర్వహించే అవకాశాన్ని కల్పించేలా ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. ఈ విషయాన్ని హెడ్‌ ఆడమ్‌ మోస్సేరి అధికారికంగా తెలిపారు...

Instagram: ఇన్‌స్టాలో మరో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఇకపై కామెంట్‌ సెక్షన్‌లో..
Instagram
Follow us on

ప్రముఖ సోషల్‌ మీడియా సైట్ ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌లకు యూత్‌లో ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తక్కువ సమయంలో ఎక్కువ మంది యూజర్లను సొంతం చేసుకుందీ సోషల్‌ మీడియా దిగ్గజం. ముఖ్యంగా యువతను టార్గెట్‌ చేసుకొని తీసుకొస్తున్న కొత్త ఫీచర్స్‌ కారణంగా ఇన్‌స్టాగ్రామ్‌కు ఆదరణ పెరుగుతోంది.

యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తున్న ఇన్‌స్టాగ్రామ్‌ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఇన్‌స్టాగ్రామ్‌ కామెంట్ సెక్షన్‌లో పోల్స్‌ ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఏదైనా ఒక అంశంపై పోల్స్‌ నిర్వహించే అవకాశాన్ని కల్పించేలా ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. ఈ విషయాన్ని హెడ్‌ ఆడమ్‌ మోస్సేరి అధికారికంగా తెలిపారు. ఈ ఫీచర్‌ను తీసుకురానున్నట్లు అధికారికంగా తెలిపారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్లు చేసే కామెంట్స్‌కు అనుగుణంగా ఈ పోల్స్‌ను నిర్వహించుకునే వెసులుబాటును కల్పించనున్నారు. దీంతో ఒక అంశంపై యూజర్ల అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశాన్ని కల్పించనున్నారు. కామెంట్‌ సెక్షన్‌ను మరింత ఆసక్తిగా మార్చడంపై దృష్టిసారించిన మెటా అందులో భాగంగానే కామెంట్ సెక్షన్‌లో పోల్‌ నిర్వహించుకునే ఫీచర్‌ను తీసుకొస్తోంది. అయితే ఈ ఫీచర్‌ ఇప్పటికే అందుబాటులో ఉన్నా,కేవలం ఇన్‌స్టా స్టోరీలో మాత్రమే అవకాశం ఉండేది.

త్వరలోనే సాధారణ పోస్టులు, రీల్స్‌.. రెండింటిలో కూడా కామెంట్‌ సెక్షన్స్‌లో పోల్స్‌ నిర్వహించుకోవచ్చు. పోల్‌లో ఎంత మంది పాల్గొన్నారు.? పేర్కొన్న అంశంపై ఎవరి దేనికి ఓటు వేశారు అన్న దానిని చూసుకోవచ్చు. అయితే పోల్‌లు చేసిన తర్వాత ఎంతకాలం ఉంటాయనే విషయంపై ఇన్‌స్టా ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం టెస్టింగ్‌ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇదిలా ఉంటే మెటా యూజర్లను ఆకట్టుకునే దిశంగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే సోషల్ మీడియా సైట్స్ లో పలు రకాల ఫీచర్లను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కూడా ఆకర్షణీయమైన ఫీచర్ ను పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు వాట్సాప్ లో కేవలం ఒకే సిమ్ ను ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయితే క్లోనింగ్, ఫేక్ యాప్స్ తో రెండు సిమ్ లను ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది. కానీ తాజాగా వాట్సాప్ అధికారికంగా ఈ ఫీచర్ ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇకపై వాట్సాప్ లో రెండు ఖాతాలను ఉపయోగించుకోవచ్చని తెలిపింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..