Infinix: అదిరిపోయే ఫీచర్లలో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న కొత్త ఫోన్‌! పైగా బడ్జెట్‌ ధరలోనే..

ఇన్ఫినిక్స్ నోట్ 60 అల్ట్రా ఫిబ్రవరి 18న విడుదల కానుంది. ఇందులో MediaTek Dimensity 8400 చిప్‌సెట్, 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్, టూ-వే శాటిలైట్ కమ్యూనికేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. Pininfarina డిజైన్‌తో ప్రీమియం లుక్‌తో రానున్న ఈ ఫోన్, మిడ్‌రేంజ్ విభాగంలో అద్భుతమైన పనితీరును అందించగలదు.

Infinix: అదిరిపోయే ఫీచర్లలో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న కొత్త ఫోన్‌! పైగా బడ్జెట్‌ ధరలోనే..
Infinix Note 60 Ultra

Updated on: Feb 16, 2026 | 7:54 PM

Infinix తన కొత్త స్మార్ట్‌ఫోన్ ఇన్ఫినిక్స్ నోట్ 60 అల్ట్రాను ఫిబ్రవరి 18న అధికారికంగా విడుదల చేయనుంది. ఇటీవల గీక్‌బెంచ్‌లో ఈ ఫోన్ MediaTek Dimensity 8400 చిప్‌సెట్‌తో కనిపించడం ఆసక్తిని రేకెత్తించింది. అత్యాధునిక ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ కాకపోయినా బడ్జెట్‌ రేంజ్‌లో సమర్థవంతమైన అప్పర్-మిడ్‌రేంజ్ పనితీరును అందించాలనే లక్ష్యంతో ఈ చిప్‌సెట్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

లీకుల ప్రకారం.. ఈ ఫోన్‌లో 144Hz రిఫ్రెష్‌రేట్‌తో కూడిన AMOLED డిస్‌ప్లే ఉండొచ్చని సమాచారం. ఫోటోగ్రఫీ ప్రియులకు 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అలాగే 7,000mAh భారీ బ్యాటరీతో దీర్ఘకాలిక వినియోగం సాధ్యమవుతుందని అంచనా. 100W వైర్డు, 30W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వేగంగా చార్జ్ అయ్యే సామర్థ్యం కూడా ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.

మరో ఆసక్తికరమైన అంశం టూ-వే శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్. అత్యవసర పరిస్థితుల్లో నెట్‌వర్క్ లేకున్నా కనెక్టివిటీ అందించే ఈ సదుపాయం మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో అరుదుగా కనిపిస్తుంది. డిజైన్ పరంగా ఇటాలియన్ డిజైన్ సంస్థ Pininfarina తో కలిసి రూపొందించినట్లు సమాచారం దీనివల్ల ప్రీమియం లుక్ అందే అవకాశం ఉంది. మార్కెట్లో ఇది Redmi Note series, Realme 16 series మరియు iQOO Neo 10R వంటి మోడళ్లతో పోటీ పడనుంది. మొత్తానికి ప్రాసెసింగ్ శక్తికంటే బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్ వేగం, డిస్‌ప్లే నాణ్యతపై దృష్టి సారించిన ఫోన్‌గా ఇన్ఫినిక్స్ నోట్ 60 అల్ట్రా నిలవనుంది.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us