WhatsApp: వాట్సాప్‌ ప్రైవసీ పాలసీ బాగానే దెబ్బ కొట్టిందిగా… భారత్‌లో ఎంత మంది అన్ ఇన్‌స్టాల్‌ చేశారో తెలుసా..?

|

Jan 30, 2021 | 4:05 PM

Users Deleted WhatsApp: ఈ ఏడాది ప్రారంభంలో వాట్సాప్‌ కొత్త ప్రైవసీ పాలసీ తీసుకొస్తుందన్నదానిపై ఎంతటి చర్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాట్సాప్‌.. యూజర్ల డేటా రక్షణను ప్రశ్నార్థకంగా...

WhatsApp: వాట్సాప్‌ ప్రైవసీ పాలసీ బాగానే దెబ్బ కొట్టిందిగా... భారత్‌లో ఎంత మంది అన్ ఇన్‌స్టాల్‌ చేశారో తెలుసా..?
Follow us on

Users Deleted WhatsApp: ఈ ఏడాది ప్రారంభంలో వాట్సాప్‌ కొత్త ప్రైవసీ పాలసీ తీసుకొస్తుందన్నదానిపై ఎంతటి చర్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాట్సాప్‌.. యూజర్ల డేటా రక్షణను ప్రశ్నార్థకంగా మారుస్తోందంటూ జరిగిన చర్చ ఆ యాప్‌పై తీవ్ర ప్రభావం చూపింది.

చాలా మంది యూజర్లు వాట్సాప్‌ను తమ మొబైల్‌ ఫోన్లలో నుంచి అన్ఇన్‌స్టాల్ చేసి ప్రత్యామ్నాయంగా వచ్చిన టెలిగ్రామ్‌, సిగ్నల్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. అయితే డేటా సెక్యూరిటీ విషయంలో జరుగుతోన్న చర్చపై వాట్సాప్‌ అప్రమత్తమై దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తాము కొత్త పాలసీ తీసుకురావట్లేదని ప్రకటించింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వాట్సాప్‌ ఎంతో మంది యూజర్లను కోల్పోయింది. తాజాగా ఇదే విషయమై నిర్వహించిన ఓ ఆన్‌లైన్‌ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఇప్పటి వరకు సుమారు 5 శాతం మంది భారతీయులు వాట్సాప్‌ను డిలీట్‌ చేశారని సదరు సర్వేలో తేలింది. భారత్‌లో మొత్తం 40 కోట్ల మంది వాట్సాప్‌ యూజర్స్‌ ఉండగా అందులో సుమారు 2 కోట్ల మంది యాప్‌ను అన్‌ ఇన్‌స్టాల్‌ చేశారని అంచనా. ఇక 21 శాతం మంది వాట్సాప్‌ వాడకాన్ని తగించేశారని తేలింది.

Also Read:
Telegram, WhatsApp: వాట్సాప్‌ టు టెలిగ్రాం.. చాట్‌ హిస్టరీని సులభంగా టెలిగ్రాంలోకి మార్చుకునే సౌకర్యం
Xiaomi: సరికొత్త ఛార్జింగ్ టెక్నాలజీని పరిచయం చేసిన షియోమీ… చూస్తే అవాక్కవ్వాల్సిందే..