
స్మార్ట్‌ఫోన్ డిజైన్‌లో కొత్తదనాన్ని కోరుకునే వారికి OSTA O1 Pro మోడల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ముఖ్యంగా పెద్ద బ్యాటరీ, అధిక రిజల్యూషన్ కెమెరాతో పాటు విభిన్నమైన స్క్రీన్ డిజైన్‌ను ఇందులో కలిపి అందించారు. ప్రస్తుతం చైనాలో నాలుగు RAM, స్టోరేజ్ వేరియంట్లలో ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ఈ ఫోన్ ధరలు, స్పెసిఫికేషన్లు టెక్ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
Huawei OSTA O1 Proలో 6.39 అంగుళాల 1.5K LTPS ఫ్లాట్ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 16:9.5గా ఉంది. సాధారణ స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే వెడల్పైన స్క్రీన్ డిజైన్ దీని ప్రత్యేకత. వెనుక భాగంలో హారిజాంటల్ డ్యూయల్ కెమెరా మాడ్యూల్, OSTA లోగోను ఏర్పాటు చేశారు. Starry Black, Nebula White, Starburst Purple రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది.
పనితీరు కోసం Huawei సొంత Kirin 9030S చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇందులో 12GB RAMతో 256GB, 512GB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. అలాగే 16GB RAMతో 512GB, 1TB స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ HarmonyOS 7 AI Pioneer Edition ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. సిస్టమ్ స్థాయిలో పలు AI ఫీచర్లను అందించినట్లు కంపెనీ తెలిపింది. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, చిప్‌సెట్, క్లౌడ్ మధ్య సమన్వయంతో పనిచేసేలా రూపొందించినట్లు వెల్లడించింది.
ఫొటోగ్రఫీ కోసం వెనుకవైపు 200MP RYYB ప్రైమరీ కెమెరాను అందించారు. ఇందులో 1/1.28 అంగుళాల సెన్సార్ ఉపయోగించారు. దీనికి జతగా 50MP 3.7x RYYB పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, Red Maple లెన్స్ ఉన్నాయి. జూమ్ ఫొటోగ్రఫీతో పాటు సాధారణ చిత్రాలను మెరుగైన నాణ్యతతో క్యాప్చర్ చేయడం ఈ కెమెరా సెటప్ లక్ష్యం.
బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 7,000mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీని అమర్చారు. 66W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. చైనాలో ఈ ఫోన్ 12GB + 256GB వేరియంట్ 5,499 యువాన్ (సుమారు రూ.76,500), 12GB + 512GB వేరియంట్ 6,499 యువాన్ (సుమారు రూ.90,330) ధరకు అందుబాటులో ఉంది. 16GB + 512GB మోడల్ ధర 7,299 యువాన్ (సుమారు రూ.1,01,458) కాగా, 16GB + 1TB వేరియంట్ ధర 8,799 యువాన్ (సుమారు రూ.1,22,309)గా ఉంది.
ప్రస్తుతం Huawei OSTA O1 Pro చైనా మార్కెట్లో ప్రీ-ఆర్డర్లకు అందుబాటులో ఉంది. భారత్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ విడుదలపై కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాబట్టి ఇండియా లాంచ్ తేదీ, ధర వివరాలు తెలియాల్సి ఉంది.