WhatsApp: మీకు తెలియని వాట్సాప్‌ గ్రూప్‌లో యాడ్‌ అవుతున్నారా.? ఈ చిన్న సెట్టింగ్ మార్చేయండి..

యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్న వాట్సాప్‌ వారి భద్రత విషయంలో కూడా రాజీ పడడం లేదు. సెక్యూరిటీ కోసం ఎన్నో కొత్త సెట్టింగ్స్‌ను, ఫీచర్లను వాట్సాప్‌ పరిచయం చేస్తోంది. ఇక వాట్సాప్‌ ఉపయోగిస్తున్న వారిలో కొందరు ఎదుర్కొనే సమస్యలో వాట్సాప్‌ గ్రూప్‌లు ఒకటి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఓ సెట్టింగ్ అందుబాటులో ఉంది...

WhatsApp: మీకు తెలియని వాట్సాప్‌ గ్రూప్‌లో యాడ్‌ అవుతున్నారా.? ఈ చిన్న సెట్టింగ్ మార్చేయండి..
Whatsapp Group
Follow us

|

Updated on: Jun 07, 2024 | 4:50 PM

వాట్సాప్‌.. ఈ యాప్‌ లేని స్మార్ట్‌ ఫోన్‌ ఉండదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న ఏకైక మెసేజింగ్‌ యాప్‌గా వాట్సాప్ నిలిచింది. ఇందులోని ఫీచర్సే దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఎన్నో రకాల మెసేజింగ్ యాప్స్‌ అందబాటులోకి వస్తున్నా వాట్సాప్‌కు ఆదరణ తగ్గడం లేదు.

యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్న వాట్సాప్‌ వారి భద్రత విషయంలో కూడా రాజీ పడడం లేదు. సెక్యూరిటీ కోసం ఎన్నో కొత్త సెట్టింగ్స్‌ను, ఫీచర్లను వాట్సాప్‌ పరిచయం చేస్తోంది. ఇక వాట్సాప్‌ ఉపయోగిస్తున్న వారిలో కొందరు ఎదుర్కొనే సమస్యలో వాట్సాప్‌ గ్రూప్‌లు ఒకటి.

మనకు తెలిసిన వ్యక్తులు మనల్ని గ్రూప్స్‌లో యాడ్‌ చేస్తే పర్లేదు కానీ అలా కాకుండా తెలియని వారు కూడా మన నెంబర్స్‌ను గ్రూప్స్‌లో యాడ్ చేస్తే ఇబ్బందులు వస్తుంటాయి. ఇటీవల ఇలాంటి ఫ్రాడ్స్‌ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ఏదో పార్ట్‌ టైమ్‌ జామ్‌ పేరుతో గ్రూప్‌లను క్రియేట్‌ చేస్తూ మోసం చేస్తున్నారు. వీటితో పాటు ఆన్‌నోన్‌ నెంబర్స్‌ నుంచి కాల్స్ కూడా ఎక్కువవుతున్నాయి. ఇలాంటి సమస్యల బారినపడకుండా ఉండేందుకు వాట్సాప్‌లో చిన్న సెట్టింగ్స్‌ అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇందుకోసం ముందుగా మీ వాట్సాప్‌ను ఓపెన్‌ చేయాలి. అనంతరం సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. ప్రైవసీ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. అనంతరం అందులో గ్రూప్స్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది.. అది క్లిక్‌ చేయగానే ఎవ్రీవన్‌, మై కాంటాక్ట్స్‌, మై కాంటాక్ట్స్‌ ఎక్సెప్ట్ అనే ఆప్షన్స్‌ కనిపిస్తాయి. అందులో ‘మై కాంటాక్ట్స్‌’ అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. దీంతో కేవలం మీ ఫోన్‌లో సేవ్‌ చేసుకున్న నెంబర్ల వాళ్లు క్రియేట్ చేసిన గ్రూప్‌లోనే మీరు యాడ్ అవుతారు.

ఇక తెలియని వ్యక్తుల నుంచి కాల్స్‌ రాకూడదంటే అందుకోసం వెనక్కి వచ్చి అదే ప్రైవసీ సెట్టింగ్‌లో ‘కాల్స్‌’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. వెంటనే మీకు ‘సైలెన్స్‌ ఆన్‌నోన కాలర్స్‌’ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిని ఎనేబుల్‌ చేసుకోవాలి. ఇలా చేస్తే మీ ఫోన్‌లో లేని నెంబర్ల నుంచి కాల్స్ మీకు కాల్‌ రాకుండా ఉంటుంది. అలాగే ‘అడ్వాన్స్‌డ్‌’ ఆప్షన్‌ క్లిక్‌ చేసి.. ‘ప్రొటెక్ట్‌ ఐపీ అడ్రస్‌ ఇన్‌ కాల్స్‌’ను ఎనేబుల్ చేసుకోవాలి ఇలా చేస్తే కాలర్స్‌కు మీ ఫోన్‌ వివరాలను పొందకుండా చేయొచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్