హీరో నుంచి విడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది! ధర ఎంతో తెలిస్తే ఎగిరిగంతేస్తారు!

హీరో మోటోకార్ప్ తన విడా బ్రాండ్ కింద దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ VX2ను విడుదల చేసింది. బ్యాటరీ రెంటల్ మోడల్‌తో దీని ప్రారంభ ధర 44,990గా నిర్ణయించారు. 100 కిలోమీటర్ల వరకు రేంజ్, రిమూవబుల్ బ్యాటరీ, స్మార్ట్ కనెక్టివిటీ, యాంటీ-థెఫ్ట్ ఫీచర్లతో ఇది మధ్యతరగతి వినియోగదారులను ఆకర్షిస్తోంది.

హీరో నుంచి విడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది! ధర ఎంతో తెలిస్తే ఎగిరిగంతేస్తారు!
Hero Vida Vx2

Updated on: May 25, 2026 | 9:59 AM

దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరలు, నిర్వహణ ఖర్చుల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగదారుల ఆసక్తి వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకాప్‌ తన ఎలక్ట్రిక్ బ్రాండ్ విడా కింద కొత్తగా హీరో విడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దేశంలోనే అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా నిలిచిన ఈ మోడల్ ప్రారంభ ధర రూ.44,990గా నిర్ణయించారు.

ఈ స్కూటర్‌లో ప్రత్యేక ఆకర్షణ బ్యాటరీ రెంటల్ మోడల్. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల్లో బ్యాటరీ ఖర్చు మొత్తం ధరలో దాదాపు సగం వరకు ఉంటుంది. అయితే విడా VX2లో వినియోగదారులు బ్యాటరీని అద్దె ప్రాతిపదికన ఉపయోగించుకోవచ్చు. దీంతో స్కూటర్ కొనుగోలు ధర గణనీయంగా తగ్గింది. వినియోగదారులు తమ ప్రయాణ దూరాన్ని బట్టి కిలోమీటరుకు రూ.0.90 నుంచి రూ.1.47 వరకు బ్యాటరీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కూటర్ రెండు బ్యాటరీ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 2.2 kWh బ్యాటరీతో ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 92 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

ఇక 3.4 kWh బ్యాటరీతో 100 కిలోమీటర్ల వరకు రేంజ్ లభిస్తుంది. గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉంది. రిమూవబుల్ బ్యాటరీ టెక్నాలజీ కారణంగా ఇంట్లోనే సాధారణ 3-పిన్ సాకెట్‌తో ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఫీచర్ల పరంగా కూడా ఈ స్కూటర్ ఆకట్టుకుంటోంది. 4.3 అంగుళాల డిజిటల్ LCD డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ అలర్ట్స్ వంటి స్మార్ట్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అదనంగా జియో ఫెన్సింగ్, లైవ్ ట్రాకింగ్, యాంటీ థెఫ్ట్ అలారం వంటి భద్రతా సదుపాయాలు కూడా ఉన్నాయి. మార్కెట్లో ఇది TVS iQube, బజాజ్‌ చేతక్‌, Ather Rizta వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us