Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hero HF Deluxe 2023: హీరో నుంచి సూపర్ బైక్.. జస్ట్ రూ. 60 వేలే.. ఫీచర్స్ మాత్రం అదుర్స్..

కమ్యూటర్ బైక్‌ల విక్రయాలలో అగ్రగామిగా ఉన్న హీరో మోటోకార్ప్ సరికొత్త బైక్ మోడల్‌ని తీసుకువచ్చింది. హెచ్ఎఫ్ డీలక్స్ న్యూ మోడల్‌ను విడుదల చేసింది. 2023 హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్ మోడల్, ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధర రూ. 60,760 గా ఉంది. కొత్త మోడల్‌ను కాన్వాస్ బ్లాక్ ఎడిషన్‌లో విడుదల చేసింది సంస్థ. నెక్సస్ బ్లూ, క్యాండీ బ్లేజింగ్ రెడ్, హెవీ గ్రే, బ్లాక్..

Hero HF Deluxe 2023: హీరో నుంచి సూపర్ బైక్.. జస్ట్ రూ. 60 వేలే.. ఫీచర్స్ మాత్రం అదుర్స్..
Hero Motor
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 04, 2023 | 7:28 AM

కమ్యూటర్ బైక్‌ల విక్రయాలలో అగ్రగామిగా ఉన్న హీరో మోటోకార్ప్ సరికొత్త బైక్ మోడల్‌ని తీసుకువచ్చింది. హెచ్ఎఫ్ డీలక్స్ న్యూ మోడల్‌ను విడుదల చేసింది. 2023 హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్ మోడల్, ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధర రూ. 60,760 గా ఉంది. కొత్త మోడల్‌ను కాన్వాస్ బ్లాక్ ఎడిషన్‌లో విడుదల చేసింది సంస్థ. నెక్సస్ బ్లూ, క్యాండీ బ్లేజింగ్ రెడ్, హెవీ గ్రే, బ్లాక్ మరియు స్పోర్ట్ రెడ్ కలర్స్‌లోనూ అందుబాటులో ఉన్న ఈ కొత్త బైక్ ఆల్ బ్లాక్ థీమ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

కొత్త బైక్ ఫీచర్లు..

కొత్త హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్‌లో హీరో కంపెనీ ఈసారి అనేక ఆకర్షణీయమైన ఫీచర్లను అసెంబుల్ చేసింది. ట్యూబ్‌లెస్ టైర్‌తో పాటు అలోయ్ వీల్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, టాయ్ గార్డ్ సౌకర్యాలు ఉన్నాయి. హాలోజన్ లైటింగ్స్, యుఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్ సౌకర్యాలతో పాటు, కొత్త బైక్ 805 మి.మీ సీట్ ఎత్తుతో 112 కిమీ బరువును కలిగి ఉంది.

ఇంజిన్, మైలేజ్..

హీరో మోటోకార్ప్ కొత్త బైక్‌ను BS6 స్టేజ్ II నిబంధనలకు అనుగుణంగా ఉండే ఇంజిన్‌తో అమర్చింది. కొత్త టెక్నాలజీ స్ఫూర్తితో 97.2 cc ఇంజిన్ మోడల్ 7.9 హార్స్ పవర్, 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ కొత్త బైక్‌లో, అప్‌డెటెడ్ ఇంజిన్‌తో పాటు, హీరో కంపెనీ iTriS టెక్నాలజీని ఉపయోగించింది. దీని కారణంగా కొత్త బైక్ లీటర్ పెట్రోల్‌కు గరిష్టంగా 65 నుండి 70 కిమీ మైలేజీని ఇస్తుందని కంపెనీ హామీ ఇచ్చింది. అలాగే కొత్త ఫీచర్లు కస్టమర్ ఫ్రెండ్లీగా ఉంటాయని, అమ్మకాలను మరింతగా పెంచడంలో సహాయపడతాయని హీరో మోటోకార్ప్ కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..