టెలికం రంగంలో సెన్సేషన్ రిలయన్స్ జియో. తక్కువ ధరలోనే నాణ్యమైన సేవలను అందిస్తూ.. గ్రామీణ భారతానికి కూడా ఇంటర్ నెట్ సేవలను దగ్గర చేయడంలో విజయవంతమైంది. ఇప్పుడు మరో ముందడుగు వేస్తూ 5జీ ఫిక్స్‌డ్-వైర్‌లెస్ యాక్సెస్ సర్వీస్ జియో ఎయిర్ ఫైబర్ ను దేశ వ్యాప్తంగా వినియోగంలోకి తెస్తోంది. ఇప్పటికే దేశంలోని 115 నగరాల్లో ఈ ఎయిర్ ఫైబర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది.సెప్టెంబర్ 2023లో ప్రారంభమైన ఈ జియో ఎయిర్ ఫైబర్.. వైర్డు కనెక్షన్ వెళ్లడం కష్టతరమైన ప్రాంతాలకు సైతం వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తుంది. ఈ పోర్టబుల్ వైర్‌లెస్ ఇంటర్నెట్ సేవ 1.5 జీబీపీఎస్ వరకు వేగంతో ఇంటర్ నెట్ సేవలను అందిస్తుంది. ఇది గృహాలకు, కార్యాలయ అవసరాలకు సైతం వినియోగించుకోవచ్చు.
రిలయన్స్ జియో తన ఎయిర్‌ఫైబర్ సేవను 2023, సెప్టెంబర్ 19న దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలతో ప్రారంభించింది. తక్కువ వ్యవధిలోనే గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాల్లోని మొత్తం 115 నగరాలకు తన సేవను విస్తరించింది. ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో ఎయిర్ ఫైబర్ అందుబాటులో ఉంది. మహారాష్ట్రలో ముంబై, పూణే, నాగ్‌పూర్, నాందేడ్, నాసిక్‌లలో అందుబాటులో ఉంది. ఇతర రాష్ట్రాల్లోని అనేక నగరాల్లో కూడా ఈ సేవ అందుబాటులో ఉంది. రిలయన్స్ జియో 2023 చివరిలోపు మరిన్ని నగరాలకు ఎయిర్‌ఫైబర్‌ని విస్తరించాలని యోచిస్తోంది. మీ ప్రాంతంలో ఎయిర్‌ఫైబర్ అందుబాటులో ఉందో లేదో తనిఖీ చేయడానికి, రిలయన్స్ జియో వెబ్‌సైట్‌ని సందర్శించండి.
జియో ఎయిర్‌ఫైబర్ సర్వీస్ రెండు ప్లాన్ ఆప్షన్లను అందిస్తోంది. ఎయిర్‌ఫైబర్, ఎయిర్‌ఫైబర్ మ్యాక్స్ పేరిట ఉంటాయి. కాగా ఈ ప్లాన్లకు అదనంగా రూ. 1000 ఇన్‌స్టాలేషన్ ఛార్జీ వర్తిస్తుందని కంపెనీ ప్రకటించింది. అయితే 12 నెలల ప్లాన్‌ని ఎంచుకునే వినియోగదారులకు ఈ ఇన్‌స్టాలేషన్ ఛార్జీ నుంచి మినహాయింపు ఉంటుందని రిలయన్స్ పేర్కొంది.
ఎయిర్‌ఫైబర్ ప్లాన్స్..
ఎయిర్‌ఫైబర్ మ్యాక్స్ ప్లాన్స్..
హై-స్పీడ్ ఇంటర్నెట్‌తో పాటు జియో ఎయిర్‌ఫైబర్ కొన్ని అదనపు ప్రయోజనాలు కూడా వినియోగదారులకు అందిస్తోంది. అది పేరెంటల్ కంట్రోల్స్, వైఫై 6 సపోర్టు, ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ఫైర్‌వాల్ వంటి ఫీచర్లను అందిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..