Valentines Day Gift: మీ ప్రియమైన వారికి వాలెంటైన్ గిఫ్ట్‌ ఇవ్వాలా? ఈ స్మార్ట్ ఫోన్లు ట్రై చేయండి.. అతి తక్కువ ధరలోనే..

ఎప్పుడూ రోటీన్ గిఫ్ట్ లే కాకుండా.. ఈ సారి కాస్త భిన్నంగా ఆలోచించి ఓ స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ ఇస్తే ఎలా ఉంటుంది? అయితే మరీ బడ్జెట్ మరీ ఎక్కువ అయిపోతుందని ఆలోచిస్తున్నారా? అయితే మీ కోసం అనువైన బడ్జెట్లోనే బెస్ట్ స్మార్ట్ ఫోన్లను మీకు అందిస్తున్నాం. రూ. 6,000లోపు ధరలోనే ఇవి లభిస్తాయి. ఇటీవలే లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్లలో పెద్ద డిస్ ప్లేలు, శక్తివంతమైన స్పీకర్లు, బలమైన బ్యాటరీ లైఫ్ కూడా ఉంటాయి.

Valentines Day Gift: మీ ప్రియమైన వారికి వాలెంటైన్ గిఫ్ట్‌ ఇవ్వాలా? ఈ స్మార్ట్ ఫోన్లు ట్రై చేయండి.. అతి తక్కువ ధరలోనే..
Gift Ideas

Updated on: Jan 30, 2024 | 7:16 AM

వాలెంటైన్స్ డే సమీపిస్తోంది. ఏటా ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజుగా అందరూ నిర్వహిస్తూ ఉంటారు. ఆ రోజున తమ ఇష్టమైన వారికి బహుమతులు ఇస్తూ తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. ప్రేమికులతో పాటు తమ జీవిత భాగస్వామికి కూడా పలువురు గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. ఎప్పుడూ రోటీన్ గిఫ్ట్ లే కాకుండా.. ఈ సారి కాస్త భిన్నంగా ఆలోచించి ఓ స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ ఇస్తే ఎలా ఉంటుంది? అయితే మరీ బడ్జెట్ మరీ ఎక్కువ అయిపోతుందని ఆలోచిస్తున్నారా? అయితే మీ కోసం అనువైన బడ్జెట్లోనే బెస్ట్ స్మార్ట్ ఫోన్లను మీకు అందిస్తున్నాం. రూ. 6,000లోపు ధరలోనే ఇవి లభిస్తాయి. ఇటీవలే లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్లలో పెద్ద డిస్ ప్లేలు, శక్తివంతమైన స్పీకర్లు, బలమైన బ్యాటరీ లైఫ్ కూడా ఉంటాయి. ఈ ఫోన్లపై అత్యంత ప్రజాదరణ పొందిన ఈ-కామర్స్ సైట్ అమెజాన్ లో ఉత్తమమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

రెడ్ మీ ఏ2..

ఈ స్మార్ట్ ఫోన్ 2జీబీ ర్యామ్ 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇది రెడ్ మీ నుంచి వస్తున్న బేస్ మోడల్ స్మార్ట్ ఫోన్. దీనిలో హెచ్డీ ప్లస్ డిస్ ప్లే ఉంటుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. మీడియా టెక్ హీలియో జీ36 ప్రాసెసర్ ఉంటుంది. సెల్ఫీల కోసం వెనుక ప్యానెల్లో 8ఎంపీ కెమెరా, ముందు భాగంలో 5ఎంపీ కెమెరా ఉంటుంది. దీని ధర అమెజాన్ లో రూ. 5,499గా ఉంది.

మోటోరోలా ఈ13..

మోటోరోలా నుంచి వస్తున్న ఈ ఫోన్ అమెజాన్లో రూ. 5,900కి లిస్ట్ చేసి ఉంది. దీనిలో 2జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. ఈ చవకైన ఫోన్లో 6.5 అంగుళాల ఎల్సీడీ డిస్ ప్లే ఉంది. ఈ ఫోన్ పనితీరును పెంచడానికి, యూనిసోక్ టీ606 ప్రాసెసర్ ఉంటుంది. ఫోన్ వెనుక ప్యానెల్లో 13ఎంపీ కెమెరా, సెల్ఫీల కోసం ముందు భాగంలో 5ఎంపీ కెమెరా ఉంటుంది. దీనిలో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

పోకో సీ51..

ఈ ఫోన్ ధర అమెజాన్లో రూ. 5,799గా ఉంది. దీనిలో 4జీబీ ర్యామ్, 64జీబీ మెమరీ ఉంటుంది. అదనంగా 3జీబీ వర్చువల్ ర్యామ్ సపోర్టు కూడా ఉంది. ఈ ఫోన్ 6.52 అంగుళాల హెచ్డీ+ డిస్ ప్లేను కలిగి ఉంది. మెరుగైన పనితీరుని అందించడానికి మీడియా టెక్ హీలియో జీ36 ప్రాసెసర్ ను ఉపయోగించారు. ఫోటోగ్రఫీ కోసం 8ఎంపీ డ్యూయల్ బ్యాక్ కెమెరా, 5ఎంపీ ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంటుంది. దీనిలో 5000ఎంఏహెచ్ బ్యాటరీ అందుబాటులో ఉంది.

మైక్రోమాక్స్ ఇన్ 2సీ..

భారతీయ బ్రాండ్ అయిన మైక్రోమాక్స్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. దీని ధర అమెజాన్లో రూ. 5,999గా ఉంది. 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ మెమరీ అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 6.52 అంగుళాల డిస్ ప్లేను కలిగి ఉంది. ఫోటోగ్రఫీ కోసం 8ఎంపీ ప్రైమరీ, 5ఎంపీ సెల్ఫీ కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పనితీరును పెంచడానికి యూనిసోక్ టీ610 ప్రాసెసర్ ఉంటుంది. దీనిలో బ్యాటరీ 5000ఎంఏహెచ్ ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..