Google Event 2024: గూగుల్ నుంచి కొత్త ఉత్పత్తులు.. లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్.. లిస్ట్‌లో ఏమున్నాయంటే..

|

Aug 11, 2024 | 6:13 PM

అనేక కొత్త ఉత్పత్తులను గూగుల్ పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. వాటిల్లో నెక్ట్స్ జెన్ గూగుల్ పిక్సల్ ఫోన్ గూగుల్ పిక్సల్ 9 సిరీస్ తో పాటు పిక్సల్ వాచ్ 3, పిక్సల్ బడ్స్ ప్రో2, కొన్ని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉత్పత్తులు కూడా గూగుల్ ఆవిష్కరించనున్నట్లు ఆన్ లైన్ సంస్థలు నివేదించాయి. వాటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Google Event 2024: గూగుల్ నుంచి కొత్త ఉత్పత్తులు.. లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్.. లిస్ట్‌లో ఏమున్నాయంటే..
Made By Google Event 2024
Follow us on

టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మేడ్ బై గూగుల్ ఈవెంట్ 2024కు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 13వ తేదీన కాలిఫోర్నియా, మౌంటేన్ వ్యూలో గూగుల్ హెడ్ క్వార్టర్స్ లో గూగుల్ హెడ్ క్వార్టర్స్ లో ఈ ఈవెంట్ జరగనుంది. దీనిలో అనేక కొత్త ఉత్పత్తులను గూగుల్ పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. వాటిల్లో నెక్ట్స్ జెన్ గూగుల్ పిక్సల్ ఫోన్ గూగుల్ పిక్సల్ 9 సిరీస్ తో పాటు పిక్సల్ వాచ్ 3, పిక్సల్ బడ్స్ ప్రో2, కొన్ని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉత్పత్తులు కూడా గూగుల్ ఆవిష్కరించనున్నట్లు ఆన్ లైన్ సంస్థలు నివేదించాయి. వాటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

కొత్త పిక్సల్ 9 సిరీస్..

ఇప్పటికే ఈ ఏడాది గూగుల్ పిక్సల్ 8 , గూగుల్ పిక్సల్ 8 ప్రో వంటివి లాంచ్ అయ్యాయి. ఇప్పుడు పిక్సల్ 9 సిరీస్ ను ఆవిష్కరించనుంది. దీనిలో మూడు ఫోన్లు ఉండే అవకాశం ఉంది. గూగుల్ పిక్సల్ 9, పిక్సల్ 9 ప్రో, పిక్సల్ 9 ప్రో ఎక్స్ఎల్, పిక్సల్ 9 ప్రో ఫోల్డ్ ఉన్నాయి.

పిక్సెల్ వాచ్ 3..

ఈ వాచ్ లాంచింగ్ ను గూగుల్ అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ.. ఇది ఈవెంట్‌లో ప్రారంభిస్తారని కొన్ని ఆన్ లైన్ నివేదికలు సూచిస్తున్నాయి. ఈ కొత్త స్మార్ట్‌వాచ్ రెండు పరిమాణాలలో-41ఎంఎం, 45ఎంఎం పరిమాణాల్లో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. 2,000-నిట్ డిస్‌ప్లే, సన్నని బెజెల్‌లు, వేగవంతమైన చార్జింగ్ సామర్థ్యాలతో ఎక్కువ కాలం ఉండే బ్యాటరీ ఉన్నాయి. గూగుల్ అధునాతన రన్నింగ్ మెట్రిక్‌లను కూడా చేర్చుతుందని పుకారు ఉంది. ఇది వాచ్ వ్యాయామ ట్రాకింగ్ సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది.

పిక్సల్ బడ్స్ ప్రో 2..

దీని గురించి కూడా అధికారికంగా వెల్లడి కాలేదు. అయినప్పటికీ గూగుల్ బడ్స్ ప్రో 2ని పరిచయం చేస్తుందని కొన్ని పుకార్లు సూచిస్తున్నాయి. తర్వాతి తరం ఇయర్‌బడ్‌లు కొత్త రంగుతో సుపరిచితమైన గుడ్డు ఆకారపు ఛార్జింగ్ కేస్, ఇన్-ఇయర్ డిజైన్‌ను కలిగి ఉంటాయని భావిస్తున్నారు. రాస్బెర్రీ, మోజిటో, పోర్సిలీన్, హేజ్ వంటి ఆప్షన్లు ఉన్నాయి. ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు సౌండ్ క్వాలిటీ, బ్యాటరీ లైఫ్‌లో మెరుగుదలలను అందించే అవకాశం ఉంది, ఆడియో మార్కెట్‌లో గూగుల్ ఉనికిని మరింత పటిష్టం చేస్తుందని చెబుతున్నారు.

ఆండ్రాయిడ్ 15, జెమిని ఏఐ..

కొత్తగా రానున్న పిక్సెల్ ఫోన్‌లు కూడా సరికొత్త ఆండ్రాయిడ్ 15తో వస్తాయని భావిస్తున్నారు. ఆండ్రాయిడ్ 15 విడుదలను గూగుల్ ఆలస్యం చేయవచ్చని నివేదికలు ఉన్నప్పటికీ.. ఈ ఈవెంట్లోనే దాని ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. కానీ ఇది ధ్రువీకరించుకోలేదు. దీంతో పాటు గూగుల్ జెమిని ఏఐ అసిస్టెంట్ ను విస్తరించనున్నట్లు తెలుస్తోంది. ఏఐ-శక్తితో పనిచేసే అసిస్టెంట్ మెరుగైన స్మార్ట్ హోమ్ నియంత్రణలు, ఈవెంట్ వివరాల కోసం మెమరీ, గతంలో వీక్షించిన కంటెంట్‌ను రీకాల్ చేయగల సామర్థ్యం వంటి కొత్త ఫీచర్‌లను అందిస్తుందని చెబుతున్నారు. ఈ పురోగతులు వినియోగదారులకు మరింత వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందిస్తూ.. జెమిని ఏఐని మరింత ఆకర్షణీయంగా మారుస్తుందని చబుతున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..