యాపిల్‌ మ్యాక్‌బుక్‌కు పోటీగా గూగుల్‌బుక్‌ను వచ్చేసింది! ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

గూగుల్‌ I/O 2026లో గూగుల్‌బుక్‌ను ఆవిష్కరించింది, ఇది జెమిని AI ఆధారిత సరికొత్త ల్యాప్‌టాప్ ప్లాట్‌ఫామ్. ఆండ్రాయిడ్, క్రోమ్‌ఓఎస్ ఫీచర్లను ఒకే వేదికపైకి తెస్తూ, మ్యాక్‌బుక్ నియోకు గట్టి పోటీనివ్వనుంది. మ్యాజిక్ పాయింటర్, Cast My Apps వంటి విప్లవాత్మక AI ఫీచర్లతో ల్యాప్‌టాప్ వినియోగాన్ని ఈ పరికరాలు పూర్తిగా మార్చనున్నాయి.

యాపిల్‌ మ్యాక్‌బుక్‌కు పోటీగా గూగుల్‌బుక్‌ను వచ్చేసింది! ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
Googlebook

Updated on: May 14, 2026 | 8:30 AM

గూగుల్‌ తన కొత్త AI ఆధారిత ల్యాప్‌టాప్ ప్లాట్‌ఫామ్ గూగుల్‌బుక్‌ను The Android Show: I/O Edition 2026 సందర్భంగా ఆవిష్కరించింది. జెమిని AI టెక్నాలజీతో రూపొందించిన ఈ కొత్త పరికరాలు భవిష్యత్తులో ల్యాప్‌టాప్‌ల వినియోగ విధానాన్ని పూర్తిగా మార్చగలవని కంపెనీ చెబుతోంది. మార్కెట్లో ఇప్పటికే విజయవంతమైన MacBook Neoకు పోటీగా గూగుల్‌బుక్‌లను తీసుకొస్తున్నట్లు టెక్ వర్గాలు భావిస్తున్నాయి. గూగుల్‌బుక్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఆండ్రాయిడ్, క్రోమ్‌ఓఎస్‌లలోని ముఖ్యమైన ఫీచర్లను ఒకే వేదికపై అందిస్తుంది.

వినియోగదారులు ఆండ్రాయిడ్ యాప్‌లను నేరుగా రన్ చేయగలుగుతారు. అదే సమయంలో క్రోమ్‌బుక్‌ల మాదిరిగా వేగవంతమైన, తేలికైన అనుభవం కూడా లభిస్తుంది. ఈ పరికరాల్లో ప్రధాన ఆకర్షణ జెమినీ ఆధారిత AI ఫీచర్లే. మ్యాజిక్ పాయింటర్ అనే కొత్త ఫీచర్ ద్వారా సాధారణ కర్సర్ AI సహాయకుడిగా మారుతుంది. వినియోగదారు స్క్రీన్‌పై ఏ అంశాన్ని చూపినా, దానికి సంబంధించిన సూచనలు, చర్యలను AI వెంటనే అందిస్తుంది. ఉదాహరణకు, ఇమెయిల్‌లోని తేదీని ఎంచుకుంటే మీటింగ్‌ను షెడ్యూల్ చేయడం లేదా రెండు చిత్రాలను కలిపి ఊహాచిత్రం రూపొందించడం వంటి పనులు చేయగలదు.

Cast My Apps, Quick Access వంటి ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ యాప్‌లను ల్యాప్‌టాప్‌లో ఉపయోగించడం, ఫైళ్లను వేగంగా షేర్ చేయడం సులభమవుతుంది. అలాగే వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా జెమిని AI ప్రత్యేక విడ్జెట్‌లు, డాష్‌బోర్డ్‌లను కూడా రూపొందించగలదు. Acer, ASUS, Dell, HP, Lenovo సంస్థలతో కలిసి గూగుల్ ఈ ల్యాప్‌టాప్‌లను మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ ఏడాది శరదృతువులో గూగుల్‌బుక్‌లు విడుదలయ్యే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us