One Plus 13: వన్‌ప్లస్ ప్రియులకు గుడ్‌న్యూస్.. వచ్చే నెలలోనే నయా ఫోన్ లాంచ్

|

Sep 03, 2024 | 3:44 PM

భారతదేశంలోని స్మార్ట్ ఫోన్ మార్కెట్ ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌తో పోటీ పడుతుంది. అధిక జనాభాకు అనుగుణంగా స్మార్ట్ ఫోన్ సేల్స్ కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా, అమెరికా తర్వాత ఎక్కువగా స్మార్ట్ ఫోన్‌లు భారతదేశంలోనే అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలో టాప్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్‌లోకి లాంచ్ చేస్తున్నాయి.

One Plus 13: వన్‌ప్లస్ ప్రియులకు గుడ్‌న్యూస్.. వచ్చే నెలలోనే నయా ఫోన్ లాంచ్
One Plus 13
Follow us on

భారతదేశంలోని స్మార్ట్ ఫోన్ మార్కెట్ ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌తో పోటీ పడుతుంది. అధిక జనాభాకు అనుగుణంగా స్మార్ట్ ఫోన్ సేల్స్ కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా, అమెరికా తర్వాత ఎక్కువగా స్మార్ట్ ఫోన్‌లు భారతదేశంలోనే అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలో టాప్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్‌లోకి లాంచ్ చేస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఈ నేపథ్యంలో వన్‌ప్లస్ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వన్‌ప్లస్ 13 ఫోన్‌పై ఆ కంపెనీ కీలక అప్‌డేట్‌ను ఇచ్చింది. అక్టోబర్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో వన్‌ప్లస్ 13 ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

వన్‌ప్లస్ 13 ఫోన్‌ను అక్టోబర్లో చైనాలో జరిగే కార్యక్రమంలో విడుదల చేసే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో కచ్చితంగా ఈ ఫోన్ లాంచ్ ఉంటుందని పేర్కొంటున్నారు. వన్‌ప్లస్ 13 స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 4 చిప్‌ సెట్‌తో వస్తుంది. ముఖ్యంగా వచ్చే నెలలో హవాయిలో జరగనున్న స్నాప్ డ్రాగన్ సమ్మిట్లో క్వాల్కమ్ ఫ్లాగ్లిప్లో ఈ కొత్త ఆండ్రాయిడ్ చిప్ సెట్‌ను ప్రకటించనుంది. 

వన్ ప్లస్ 13 ఫోన్ 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.8 అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో పని చేసే ఈ ఫోన్ 100 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ రావచ్చని అంచనా వేస్తున్నారు. వన్ ప్లస్ 13 స్మార్ట్ ఫోన్‌లో మూడు కెమెరాల సెటప్‌తో వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా 6 ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో డ్యూయల్ 50 ఎంపీ పెరిస్కోప్ కెమెరాలతో ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి