Oppo A59: ఒప్పో స్మార్ట్‌ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్.. ఏకంగా..
ఈస్మార్ట్ ఫోన్ 4 జీబీ ర్యామ్, 6జీబీ ర్యామ్ వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. లాంచింగ్ సమయంలో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 17,999గా ఉండేది. అయితే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. 22 శాతం డిస్కౌంట్‌తో ఈ ఫోన్‌ను కేవలం రూ. 13,999కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. అయితే...
ఇటీవల స్మార్ట్ ఫోన్ కంపెనీలు భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను, తక్కువ ధరకే అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఒప్పో ఏ59 పేరుతో గతేడాది డిసెంబర్‌లో ఓ ఫోన్‌ను లాంచ్ చేసింది.
ఈస్మార్ట్ ఫోన్ 4 జీబీ ర్యామ్, 6జీబీ ర్యామ్ వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. లాంచింగ్ సమయంలో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 17,999గా ఉండేది. అయితే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. 22 శాతం డిస్కౌంట్‌తో ఈ ఫోన్‌ను కేవలం రూ. 13,999కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. అయితే ఆఫర్ ఇంతటితోనే ఆగిపోలేదు, ఈ స్మార్ట్ ఫోన్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ సైతం అందిస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు చెందిన క్రెడిట్ కార్డుతో కొనుగోఉల చేస్తే రూ. 1399 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.
అంతేకాకుండా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 700 వరకు తగ్గింపు పొందొచ్చు. ఇలా బ్యాంక్ ఆఫర్స్ అన్నింటినీ ఉపయోగించుకుంటే ఈ స్మార్ట్ ఫోణ్‌ను కేవలం రూ. 12,600కే సొంతం చేసుకోవచచు. ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉందండోయ్. మీ ఫోన్‌ను ఇచ్చి భారీ డిస్కౌంట్ పొందొచ్చు. మీ పాత ఫోన్ ప్రస్తుత ఆధారంగా గరిష్టంగా రూ. 9,800 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ లెక్కన మీరు ఈ ఫోన్‌ను కేవలం రూ. 4,199కే సొంతం చేసుకోవచ్చు.
ఒప్పో ఏ59 ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే..
ఇక ఒప్పో ఏ59 స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.56 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. అలాగే ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాతో పాటు, 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.
స్కిల్ గోల్డ్ కలర్‌లో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో ప్రత్యేకంగా అల్ట్రా వ్యాల్యూమ్ మోడ్ అనే ఆప్షన్‌ను తీసుకొచ్చారు. దీంతో బెస్ట్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్‌ను పొందొచ్చు. అలాగే 90 హెచ్‌జెడ్‌తో రిఫ్రెష్ రేట్‌తో కూడిన స్క్రీన్ యూజర్లకు మంచి అనుభూతిని అందిస్తుంది. ఇక ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్‌కు ప్రత్యేకంగా 7 రోజుల సర్వీస్ సెంటర్ రీప్లెస్‌మెంట్ లేదా రిపేర్ ఆప్షన్‌ను అందిస్తోంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..