Pixel 8a: గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఇలాంటి ఆఫర్‌ మళ్లీ రాదు..

|

Jun 02, 2024 | 8:47 PM

సాధారణంగా ఈ కామర్స్‌ సంస్థలు పండుగల వేళ డిస్కౌంట్స్ ప్రకటిస్తాయని తెలిసిందే. అయితే ఇటీవల కాలంతో సంబంధం లేకుండా ఆఫర్లను ప్రకటిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్‌లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది...

Pixel 8a: గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఇలాంటి ఆఫర్‌ మళ్లీ రాదు..
Google Pixel 8a
Follow us on

సాధారణంగా ఈ కామర్స్‌ సంస్థలు పండుగల వేళ డిస్కౌంట్స్ ప్రకటిస్తాయని తెలిసిందే. అయితే ఇటీవల కాలంతో సంబంధం లేకుండా ఆఫర్లను ప్రకటిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్‌లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇంతకీ ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్‌ లభిస్తోంది.? ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 75,999గా ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌పై ప్రత్యేక డీల్‌లో భాగంగా రూ. 63,999కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. అయితే ఈ ఆఫర్‌ ఇక్కడితో ఆగిపోలేదు.. ఈ ఫోన్‌ను ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 8000 డిస్కౌంట్‌ను అందిస్తోంది. అలాగే అదనంగా రూ. 4000 డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దీంతో అన్న ఆఫర్లు కలుపుకొని ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 24000 వరకు డిస్కౌంట్‌ లభిస్తోంది. ఇక ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది. మీ పాత ఫోన్‌ను ఇవ్వడం ద్వారా గరిష్టంగా రూ. 39,999కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు.

ఇక గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.2 ఇంచెస్‌తో కూడిన ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇందులో 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెస్‌ రేట్ ఈ ఫోన్ సొంతం. అలాగే ఇందులో Google Tensor G3 చిప్‌సెట్‌ను అందించారు. Titan M2 సెక్యూరిటీ చిప్‌ ఈ ఫోన్‌ సొంతం. ఈ ఫోన్‌ను మొత్తం రెండు వేరియంట్స్‌లో లాంచ్‌ చేశారు. వీటిలో ఒకటి 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌.. 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ఉంది. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే 12 మెగాపిక్సెల్స్‌తో సెకండరీ కెమెరాను ఇచ్చారు. బ్యాటరీ పరంగా చూస్తే ఇందులో.. 27 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4575 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్‌ చేయండి..