
ఇంట్లో ఫ్యాన్ వేగంగా తిరుగుతున్నప్పటికీ సరైన గాలి రాకపోవడం చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఫ్యాన్ స్పీడ్ ఎక్కువగా ఉన్నట్టే కనిపించినా గాలి తక్కువగా రావడానికి పలు సాంకేతిక కారణాలు ఉండొచ్చు. ఫ్యాన్‌కు గాలి తగ్గడానికి ప్రధాన కారణాల్లో ఒకటి కెపాసిటర్ బలహీనపడటం. కెపాసిటర్ దెబ్బతింటే ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది కానీ పూర్తి శక్తితో పని చేయదు. దీంతో వేగంగా తిరుగుతున్నట్టే కనిపించినా గాలి సరైన స్థాయిలో రాదు. సాధారణంగా పాత ఫ్యాన్‌లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో కెపాసిటర్‌ను మార్చితే సమస్య చాలా వరకు పరిష్కారమవుతుంది.
ఇక ఫ్యాన్ రెక్కలపై దుమ్ము ఎక్కువగా పేరుకుపోయినా గాలి తగ్గుతుంది. రెక్కల ఆకారం మారడం లేదా దుమ్ము పేరుకోవడం వల్ల గాలి సరైన దిశలో వెళ్లదు. అందువల్ల ఫ్యాన్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఫ్యాన్ బేరింగ్స్ దెబ్బతిన్నా పనితీరు తగ్గుతుంది. బేరింగ్స్‌లో ఘర్షణ పెరగడంతో మోటార్‌పై ఒత్తిడి పెరిగి గాలి తక్కువగా వస్తుంది. విద్యుత్ వోల్టేజ్ తక్కువగా ఉండటం కూడా మరో కారణం కావచ్చు. ఇంట్లో వోల్టేజ్ స్థిరంగా లేకపోతే ఫ్యాన్ పూర్తి సామర్థ్యంతో పనిచేయదు. ముఖ్యంగా పాత వైరింగ్ ఉన్న ఇళ్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
అవసరమైతే ఎలక్ట్రిషియన్‌తో వైరింగ్‌ను తనిఖీ చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఫ్యాన్ మోటార్ కాయిలింగ్ బలహీనపడినా గాలి తగ్గుతుంది. చాలా సంవత్సరాలుగా వాడుతున్న ఫ్యాన్‌లలో మోటార్ సామర్థ్యం తగ్గిపోవడం సహజం. ఇలాంటి పరిస్థితుల్లో రీవైండింగ్ చేయించడం లేదా కొత్త ఫ్యాన్ కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. చిన్న సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరిస్తే విద్యుత్ వినియోగం తగ్గడంతో పాటు ఫ్యాన్ పనితీరు కూడా మెరుగుపడుతుందని వారు సూచిస్తున్నారు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి