Tech Tips: మీ ఫోన్‌ కూడా వర్షంతో తడిచిందా.. ఈ సింపుల్‌ టిప్స్‌ ఫాలో అవ్వండి

వర్షాకాలంలో మనం ఆఫీసుకు వెళ్ళినప్పుడు లేదా బయటకు వెళ్ళినప్పుడు అకాస్మాత్తుగా వర్షాలు పడడంతో మనం ఫోన్‌ తడిపోతుంటాయి. అయితే చాలా మంది ఇలా ఫోన్‌ తడిపోయిన తర్వాత కూడా దాన్ని అలానే యూజ్ చేస్తూ ఉంటారు. తడిచిన ఫోన్‌ను ఛార్జింగ్‌ పెడుతూ ఉంటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

Tech Tips: మీ ఫోన్‌ కూడా వర్షంతో తడిచిందా.. ఈ సింపుల్‌ టిప్స్‌ ఫాలో అవ్వండి
మీ ఫోన్‌ను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల మీ డేటా కూడా ప్రభావితం కావచ్చు. అకస్మాత్తుగా విద్యుత్తు అంతరాయం ఏర్పడితే లేదా బ్యాటరీ పేలిపోతే మీ ఫోన్‌లోని డేటా పోతుంది. ఫోన్ పూర్తిగా పాడైపోతుంది. కాబట్టి ఫోన్‌ను ఫ్రిజ్‌లో ఉంచి ఛార్జ్ చేయవద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు.

Updated on: Oct 05, 2025 | 2:16 PM

వర్షాకాలంలో తరచుగా మన మొబైల్‌ తడుస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మన మొబైల్ ఫోన్‌లను రక్షించుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం నాణ్యమైన వాటర్‌ప్రూఫ్ మొబైల్ కవర్ లేదా జిప్‌లాక్ బ్యాగ్ కొనడం ముఖ్యం. మీరు బయటకు వెళ్ళినప్పుడల్లా, దానిని మీ బ్యాగ్‌లో ఉంచుకోండి. ఇలా చేయడం ద్వారా, మీరు వర్షంలో బయటకు వెళ్లినా… లేదా అకస్మాత్తుగా వర్షం పడినా, ఎటువంటి సమస్య ఉండదు. ఈ విధంగా, మీరు మీ స్మార్ట్ ఫోన్‌లను సులభంగా, సురక్షితంగా నిల్వ చేసుకోవచ్చు. అయితే చాలా మంది ఇలా ఫోన్‌ తడిపోయిన తర్వాత కూడా దాన్ని అలానే యూజ్ చేస్తూ ఉంటారు. తడిచిన ఫోన్‌ను ఛార్జింగ్‌ పెడుతూ ఉంటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మనం ఫోన్‌ తడిచినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

తడి చేతులతో ఫోన్ ఛార్జ్ చేయవద్దు

వర్షంలో తడిసినప్పుడు లేదా మీ ఫోన్ తడిగా ఉన్నప్పుడు మీ ఫోన్‌ను ఛార్జ్ చేయకపోవడమే మంచిది.ఎందుకంటే నీరు, విద్యుత్ కలయిక అనేది చాలా ప్రమాదకరం. కాబట్టి మీ చేతులు లేదా ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ తడిగా ఉంటే దాన్ని ఛార్జ్ చేయకపోవడమే మంచిది. అలాంటి సమయంలో ఛార్జ్ చేయడం వల్ల ఫోన్ పేలిపోవచ్చు లేదా మీకు షాక్ కూడా రావచ్చు.

మీ ఫోన్ తడిస్తే ముందుగా ఏం చేయాలి?

మీ ఫోన్ వర్షంలో తడిసిపోతే దాన్ని వెంటనే దాన్ని స్విచ్ ఆఫ్ చేయడం మంచిది. తర్వాత, దానిని బియ్యం లేదా సిలికా జెల్ ప్యాకెట్‌లో 24 నుండి 48 గంటల పాటు ఉంచండి.

నేరుగా ఉపయోగించవద్దు:

మీ స్మార్ట్‌ఫోన్ నీటి వాటర్‌ రెసిస్టెంట్‌ అయినప్పటికీ అది వర్షంలో తడిస్తే, దాన్ని నేరుగా చెవి దగ్గర పెట్టుకుని ఫోన్‌లో మాట్లాడటం చేయకండి. ఇలా చేయడం చాలా ప్రమాదం..దానికి బదులుగా, వైర్డు ఇయర్‌ఫోన్‌లు లేదా బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌లను ఉపయోగించడం మంచిది.

ఫోన్ వేడెక్కితే ఏం చేయాలి..?

వర్షాకాలంలో మన చుట్టూ ఉన్న తేమ కారణంగా కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు త్వరగా వేడెక్కుతాయి. కాబట్టి, ఛార్జింగ్ చేస్తున్నప్పుడు మీ ఫోన్ చాలా వేడిగా అనిపిస్తే, మీరు వెంటనే ఛార్జింగ్ ఆపాలి.

మరిన్ని సైన్స్‌ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.