BYD నుంచి లగ్జరీ ఈవీల దూకుడు.. ఫీచర్లతోనే హీట్ పెంచేస్తున్న Denza Z9 GT

భారత లగ్జరీ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి మరో కీలక బ్రాండ్ అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. చైనా ఆటో దిగ్గజం BYDకు చెందిన Denza ‘Coming Soon’ పోస్టుతో ఇండియా ఎంట్రీని ప్రకటించింది. అత్యాధునిక టెక్నాలజీ, భారీ బ్యాటరీలు, శక్తివంతమైన మోటార్లతో వచ్చే ఈ బ్రాండ్ తొలి దశలో Z9 GT, D9 మోడళ్లను తీసుకురావచ్చని తెలుస్తోంది.

BYD నుంచి లగ్జరీ ఈవీల దూకుడు.. ఫీచర్లతోనే హీట్ పెంచేస్తున్న Denza Z9 GT
Denza Z9 Gt 001

Updated on: Oct 07, 2026 | 9:30 PM

ప్రీమియం EV కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని Denza భారత్‌లోకి రాబోతోంది. ఇందులో Z9 GT షూటింగ్ బ్రేక్ తన అద్భుతమైన పనితీరుతో ప్రత్యేకంగా నిలవనుంది. మూడు మోటార్లతో 1,156hp పవర్, 2.7 సెకన్లలో 100kph వేగం అందించే సామర్థ్యం దీనికి ఉంది. మరోవైపు D9 లగ్జరీ MPVగా పెద్ద కుటుంబాలకు ప్రీమియం ప్రయాణ అనుభూతిని అందించేలా రూపొందించారు.

Z9 GTలో అదిరిపోయే పనితీరు

Denza Z9 GTలో 122.5kWh బ్యాటరీ ప్యాక్‌తో మూడు ఎలక్ట్రిక్ మోటార్లు పనిచేస్తాయి. ఇవి కలిపి 1,156hp పవర్‌ను అందిస్తాయి. 0-100kph వేగాన్ని కేవలం 2.7 సెకన్లలో అందుకోగల ఈ కారు గరిష్టంగా 270kph వేగంతో ప్రయాణించగలదు. WLTP ప్రమాణాల ప్రకారం సుమారు 600 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుంది.

ఈ EVలో రియర్-వీల్ స్టీరింగ్, Crab Walk, Compass Turn 360° వంటి ప్రత్యేక డ్రైవింగ్ సదుపాయాలు ఉన్నాయి. క్యాబిన్‌లో ట్రిపుల్ స్క్రీన్ సెటప్, Level 2+ ADAS, 20-స్పీకర్ ఆడియో సిస్టమ్, లెదర్ సీట్లు అందుబాటులో ఉంటాయి. ముందు సీట్లలో హీటింగ్, వెంటిలేషన్, మసాజ్ సదుపాయాలు కూడా ఉంటాయి. భారత్‌లో దీని ధర రూ.1.2 కోట్ల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా.

D9తో లగ్జరీ MPV విభాగంలో పోటీ

Denza D9 భారత్‌లో పెద్ద లగ్జరీ MPVగా అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇందులో 103kWh బ్యాటరీతో 313hp పవర్, 360Nm టార్క్ అందించే ఎలక్ట్రిక్ మోటార్ ఉండొచ్చని సమాచారం. WLTP ప్రకారం సుమారు 520 కిలోమీటర్ల రేంజ్‌తో పాటు 200kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభించే అవకాశం ఉంది.

2+2+3 సీటింగ్ లేఅవుట్‌లో వచ్చే D9లో కెప్టెన్ సీట్లకు హీటింగ్, వెంటిలేషన్, మసాజ్ సదుపాయాలు ఉండవచ్చు. 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, Dynaudio సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది. దీని ధర సుమారు రూ.90 లక్షలుగా ఉండొచ్చని అంచనా. Denza అధికారిక లాంచ్‌తో భారత లగ్జరీ EV మార్కెట్లో కొత్త పోటీ మొదలయ్యే అవకాశం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us