OpenAI: భారత్‌లో ఓపెన్‌ఏఐ తొలి ఆఫీస్‌.. ఎక్కడ ప్రారంభించబోతున్నారంటే?

ChatGPT మాత్రు సంస్థ OpenAI భారత్‌లో తన కార్యకలాపాలను విస్తరించడంపై ఫోకస్‌ పెట్టింది. ఇందులో భాగంగానే ఈ ఏడాది చివర్లో న్యూఢిల్లీలో తన మొదటి భారతదేశ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. వినియోగదారుల సంఖ్య పరంగా ఒపెన్‌ఏఐకు భారత్‌లోనే రెండవ అతిపెద్ద మార్కెట్‌ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

OpenAI: భారత్‌లో ఓపెన్‌ఏఐ తొలి ఆఫీస్‌.. ఎక్కడ ప్రారంభించబోతున్నారంటే?
Openai First office in India

Updated on: Aug 22, 2025 | 2:48 PM

చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్‌ఏఐ భారత్‌లో తన కార్యకలాపాలను విస్తరించడంపై ఫోకస్‌ పెట్టింది. ఇందులో భాగంగానే భారత్‌లో తొలి ఓపెన్‌ఏఐ కార్యలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. వినియోగదారుల పరంగా భారత్‌లో ఓపెన్‌ఏఐ టూల్స్‌కు భారీగా డియాండ్ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ సపోర్ట్‌తో భారత్‌లోకి అడుగుపెట్టిన ఓపెన్ఏఐ దేశంలొ చట్టపరమైన సంస్థగా స్థాపించబడింది.ఆ సంస్థలో సిబ్బందిని నియమించడం కూడా ప్రారంభించినట్టు కంపెనీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

ChatGPTకి భారత్‌ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఈ విషయాన్ని ఇటీవలే ఓపెన్‌ఏఐ సీఈవో తెలిపాడు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో భారత్‌లో తమ కార్యకలాపాలను మరింత విస్తరిస్తామని ఆయన అన్నాడు. ఇందులో.. భాగంగానే ఇటీవలే ‘చాట్‌జీపీటీ గో పేరుతో తన యూజర్స్ కోసం రూ.399కే సరికొత్త, చవకైన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో తన తొలి కార్యాలయాన్ని ఓపెన్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివరిలో న్యూ ఢిల్లీలో తన నూతన కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తుంది.

ఇప్పటికే కొంత మేర ఉద్యోగ నియామకాలు కూడా చేపట్టినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా భారత్‌లో ఏఐకి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని ఓపెన్‌ ఏఐ సీఈవో సామ్‌ ఆల్ట్‌మాన్‌ అన్నారు. భారత్‌లో తమ మొదటి కార్యాలయాన్ని ప్రారంభించడం, సిబ్బందిని నియమించడం అనేది దేశవ్యాప్తంగా అధునాతన AIని మరింత అందుబాటులోకి తీసుకురావడానికి తమ నిబద్ధతలో ఒక ముఖ్యమైన మొదటి అడుగు అని OpenAI CEO సామ్ ఆల్ట్‌మాన్ ఒక ప్రకటనలో తెలిపారు.

మరిన్ని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.