ప్రపంచం దృష్టంతా ఇప్పుడు భారత్ వైపే. చంద్రుడి పై మరిన్ని పరిశోధనలు చేపట్టేందుకు చంద్రయాన్ 3 ని ప్రయోగిస్తోంది భారత్. భారత దేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న చంద్రయాన్-3 లాంఛింగ్‌కి సిద్ధంగా ఉంది. జాబిల్లిపైకి దూసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్న చంద్రయాన్-3 అందుకు సంబంధించిన రిహార్సల్స్ పూర్తిచేసుకొంది. ఈనెల 14న మధ్యాహ్నం 2:35 నిముషాలకు శ్రీహరి కోట నుంచి చంద్రయాన్-3 ని ప్రయోగిస్తారు. లాంచింగ్‌లో కీలక ప్రక్రియ ముగిసింది. చంద్రయాన్-3 లాంచింగ్ రిహార్సల్స్ పూర్తయ్యాయి. లాంచ్ ప్యాడ్‌కు వాహక నౌకను అమర్చారు శాస్త్రవేత్తలు. 24 గంటలపాటు నిర్వహించిన రిహార్సల్స్ విజయవంతం అయ్యాయి. ఇక మరో మూడు రోజుల్లో గగన వీధుల్లోకి దూసుకెళుతుంది చంద్రాయన్-3.
అప్పుడు… చంద్రయాన్-2 ప్రయోగం కోట్లాదిమంది ఆశలపై నీళ్ళు చల్లింది. ఎన్నో ఆశలుపెట్టుకున్న శాస్త్రవేత్తల ఆకాంక్షలు ఆవిరయ్యాయి. అందుకే చంద్రయాన్ -3ని ఫెయిల్యూర్ బెస్ట్ అప్రోచ్‌తో అభివృద్ధి చేశారు. ఒక్కసారి అంతరిక్షంలోకి రాకెట్ దూసుకెళ్లాక.. ఏదైనా వ్యవస్థ విఫలమైతే.. దానంతట అదే సరిచేసుకుని మళ్లీ పనిచేసేలా దీన్ని డిజైన్ చేసినట్టు చెప్పారు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్.
రూ. 615కోట్ల ఖర్చుతో మిషన్ చంద్రయాన్-3ని అభివృద్ధి చేశారు. 3.84 లక్షల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం దీని లక్ష్యం. చంద్రుడి దక్షిణ ధ్రువంలో రోవర్ ల్యాండ్ అవుతుంది. అంతా సవ్యంగా జరిగితే చంద్రయాన్ 3 దాదాపు 48 రోజులు ప్రయాణించి ఆగస్టు చివరివారంలో…అంటే ఆగస్టు 23 లేదా 24న చంద్రుడిపై ల్యాండ్ అవుతుందంటున్నారు శాస్త్రవేత్తలు. గత కాలపు వైఫల్యాలను సరిచేసుకుని…సరికొత్తగా రూపుదిద్దుకున్న చంద్రాయన్ భారతీయుల కలలకు రెక్కలు తొడుగుతోంది. ఈ ప్రయోగం విజయవంతమైతే.. భారత్ కీర్తి పతాక ప్రపంచ చిత్రపటంలో మరోసారి రెపరెపలాడటం ఖాయం.
Movement of the launch vehicle to the launch pad. pic.twitter.com/Tu973C6IjC
— ISRO (@isro) July 7, 2023
వచ్చే వారం జూలై 14న అంతరిక్ష రాకెట్‌ను ప్రయోగించనున్నారు. చంద్రయాన్ సిరీస్‌లో ఇది మూడో విడత. చంద్రుని ఉపరితలంపై విజయవంతమైన సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఇది భారతదేశం రెండవ ప్రయత్నం. ఇప్పటి వరకు, కేవలం మూడు దేశాలు మాత్రమే గాలిలేని చంద్ర ప్రపంచంపై అంతరిక్ష నౌకను విజయవంతంగా ల్యాండ్ చేశాయి.
చంద్రయాన్ 3 ప్రయోగానికి ముందు, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC)లో ఒక ప్రత్యేకమైన ప్రయోగం జరగనుంది. ‘ప్రిజం: ది అన్సెస్ట్రల్ అబోడ్ ఆఫ్ రెయిన్‌బో’ పేరుతో ఈ పుస్తకాన్ని జూలై 13న విడుదల చేయనున్నారు. ఈ పుస్తకం సైన్స్ కథనాల సమాహారం మరియు అవార్డు గెలుచుకున్న చిత్రనిర్మాత-రచయిత వినోద్ మంకర రచించారు. భారతదేశం యొక్క చారిత్రాత్మక మార్స్ ఆర్బిటర్ మిషన్ ‘మంగళయాన్’పై సైన్స్-సంస్కృత డాక్యుమెంటరీ అయిన ‘యానం’ చిత్రంతో అతను తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు.
మరిన్ని టెక్నాలజీ న్యూస్ కోసం