
Free AI Course: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిపిషీయల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎంతలా సంచలనం సృష్టిస్తుందో మనందరికీ తెలిసిందే. రోజుకో కొత్త టూల్ పుట్టుకొస్తుండగా.. కంపెనీలు కూడా ఏఐపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. కంపెనీలు కూడా తమ వర్క్ ప్రొడక్టివిటీలో ఏఐను ఉపయోగిస్తుండటంతో వర్క్ టాస్క్‌లు వేగంగా పూర్తవుతున్నాయి. దీంతో ఐటీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఇక అనేక రంగాలపై ఏఐ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇది ఇలా ఉంటే ఏఐ టెక్నాలజీ నేర్చుకున్నవారికి మార్కె్ట్‌లో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. దీంతో ఏఐ నేర్చుకునేందుకు వర్కింగ్ ప్రొఫెషనల్స్‌తో పాటు విద్యార్థులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. కంపెనీలు కూడా ఏఐ వాడకం గురించి తెలిసినవారికి ఉద్యోగాలు కల్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.
ఈ క్రమంలో అనేక ఏఐ కోచింగ్ సెంటర్స్ పుట్టగొడుగుల్లా వస్తున్నాయి. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ మోడ్‌లో కోర్సులు ప్రవేశపెడుతున్నాయి. అయితే ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్‌లో ఏఐ కోర్సులు నేర్చుకోవాలంటే వేలల్లో ఫీజు ఉంటుంది. దీందో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు, ఉద్యోగులకు ఉచితంగా ఏఐ కోర్సు అందించనుంది. యువఏఐ ఫర్ ఆల్ పేరిట ఈ కోర్సుును ప్రవేశపెట్టింది. futureskillsprime.in/course/yuva-ai-for-all అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ కోర్సులో జాయిన్ అయ్యేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కోర్సు వ్యవధి 4.5 గంటలు ఉంటుంది.
ఏఐ కోర్సును విజయవంతంగా పూర్తి చేసినవారికి కేంద్ర ప్రభుత్వం సర్టిఫికేట్‌ను కూడా జారీ చేస్తుంది. ఈ కోర్సులో మొత్తం ఆరు మాడ్యుల్స్ ఉంటాయి. ఏఐ అంటే ఏమిటి? ఏఐ టూల్స్‌ను ఎలా ఉపయోగించాలి.? నిజజీవితంలో ఏఐ ఎలా వినియోగించాలి..? ఏఐ వల్ల భవిష్యత్తు ఎలా మారబోతుంది..? అనే విషయాలు ఈ కోర్సులో నేర్పిస్తారు. ఏఐలో కెరీర్ ప్రారంభించాలనుకునే విద్యార్థులకు ఈ కోర్సు బాగా ఉపయోగపడనుంది. ఆసక్తికర అభ్యర్థులు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.