ప్రతీఒక్కరి ఫోన్‌లో ఈ ప్రభుత్వ యాప్ తప్పనిసరి.. డిలీట్ చేసినా పోదు.. కేంద్రం కీలక ఆదేశాలు

ఇకపై ప్రతీఒక్కరి ఫోన్లలో సంచార్ సౌథీ యాప్ తప్పనిసరిగా ఉండనుంది. ఈ యాప్ డిలీట్ చేసుకోవడానికి కూడా కుదరదు. కొత్తగా వచ్చే అన్ని ఫోన్లలో ఈ యాప్ డీఫాల్ట్‌గా ఉండాలని కంపెనీలకు కేంద్రం ఆదేశాలిచ్చింది. సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు ఇది ఉపయోగపడనుంది.

ప్రతీఒక్కరి ఫోన్‌లో ఈ ప్రభుత్వ యాప్ తప్పనిసరి.. డిలీట్ చేసినా పోదు.. కేంద్రం కీలక ఆదేశాలు
Sanchar Saathi App

Updated on: Dec 02, 2025 | 7:28 AM

Sanchar saathi app: భారత్‌లో సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా.. కేంద్రం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇవి తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా రోజూ వందలమంది సైబర్ ఫ్రాడ్స్ ఉచ్చులో పడి మోసపోతున్నారు. లక్షల రూపాయల డబ్బులను పొగోట్టుకుంటున్నారు. రోజుకో కొత్త రూపంలో ప్రజలను బుట్టలో వేసుకుని చాలా స్మార్ట్‌గా మోసానికి పాల్పడుతున్నారు సైబల్ క్రిమినల్స్. మెట్రో సిటీలలో ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సైబర్ క్రైమ్ పోలీసులు నేరగాళ్లను పట్టుకుని కొంతమందికి డబ్బులు తిరిగివచ్చేలా చేస్తుండగా..నిందితులను గుర్తించలేక మరికొంతమందికి తిరిగి రావడం లేదు. దేశంలో ఇలాంటి పరిస్థితులే నెలకొనగా.. దీనికి చెక్ పెట్టేందుకు కేంద్రం కొత్త ఆలోచన కనిపెట్టింది.

ఇకపై కొత్త మొబైల్ ఫోన్లలో డిఫార్ట్‌గా కేంద్ర ప్రభుత్వ ‘సంచార్ సౌథీ’ యాప్ తప్పనిసరిగా ఉండేలా చేయాలని స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలతో పాటు టెలికాం కంపెనీలకు టెలికాం మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే తయారై మార్కెట్లోకి లాంచ్ కానున్న ఫోన్లలో కూడా డీఫాల్ట్‌గా యాప్ రావాలని, అది డిలీట్ చేయడానికి వీలుకాకుండా ఉండాలని సూచించింది. ఈ మేరకు యాప్ ఇన్‌స్టలేషన్ కోసం టెలికాం, మొబైల్ తయారీ కంపెనీలకు 90 రోజుల గడుపు ఇచ్చింది. అయితే థర్డ్ పార్టీ యాప్‌లను ముందుగా ఇన్‌స్టాల్ చేయడానికి ఎప్పటినుంచో యాపిల్ వ్యతిరేకత చూపిస్తోంది. దీంతో కేంద్ర కొత్త నిర్ణయాన్ని యాపిల్ వ్యతిరేకించే అవకాశముందని తెలుస్తోంది. యాపిల్ ఒప్పుకోకపోతే కేంద్రం ఎలా స్పందిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.

సైబర్ నేరాలు, ఫోన్ల చోరీకి అడ్డుకట్ట వేసేందుకు ఈ ఏడాది జనవరిలో కేంద్రం సంచార్ సౌథీ యాప్‌ను ప్రవేశపెట్టింది. మొబైల్ చోరీకి గురైతే ఇందులోకి వెళ్లి ఫిర్యాదు చేయొచ్చు. ఐఎంఈఐ నెంబర్ ఆధారంగా పొగొట్టుకున్న పనిచేయకుండా బ్లాక్ చేయడం, ఐఎంఈఐని వెరిఫై చేసుకోవడం, ఫోన్ పోతే ఫిర్యాదు చేయడం. మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయే తెలసుకోవడం వంటి ఫీచర్లు ఉన్నాయి.  ఈ పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా చోరీకి గురైన 7 లక్షల మంది ఫోన్లను కేంద్రం గుర్తించింది. ఇక ఐఎంఈఐ నెంబర్ల ట్యాపరింగ్‌కు పాల్పడుతున్న ఘటనలు కూడా ఎక్కువైపోయాయి. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు ప్రతీ ఫోన్‌లో సంచార్ సౌథీ యాప్ ఉండాలని కేంద్రం భావిస్తోంది.