ఐ ఫోన్‌ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఛార్జింగ్ సేవ్ చేసే సూపర్ ట్రిక్స్ ఇవే !!

యాపిల్ ఐఫోన్‌ లకు టెక్ మార్కెట్లో ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఫోన్లో కెమెరా, సేఫ్టీ ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అలానే డిజైన్ పరంగా చూస్తే కూడా ఎంతో స్టైలిష్‌గా, ప్రీమియంగా ఉండే ఈ ఫోన్లు.. బ్యాటరీ విషయంలో మాత్రం ట్రోల్స్ ఎదుర్కొంటుంది. అందుకే ఈ ఐ ఫోన్ బ్యాటరీ సేవింగ్ టిప్స్ మీకోసం ప్రత్యేకంగా..

ఐ ఫోన్‌ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఛార్జింగ్ సేవ్ చేసే సూపర్ ట్రిక్స్ ఇవే !!
Iphone Battery Saving Tricks

Updated on: Nov 22, 2026 | 11:47 AM

యాపిల్ ఐఫోన్‌ లకు టెక్ మార్కెట్లో ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త సిరీస్ లను లాంఛ్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది వినియోగదారుల నమ్మకాన్ని పొందింది. ఈ ఫోన్లో కెమెరా, సేఫ్టీ ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అలానే డిజైన్ పరంగా చూస్తే కూడా ఎంతో స్టైలిష్‌గా, ప్రీమియంగా ఉండే ఈ ఫోన్లు.. బ్యాటరీ విషయంలో మాత్రం ట్రోల్స్ ఎదుర్కొంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే ఐఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుంది.

అంతే కాకుండా మన ఫోన్ ఎన్నిసార్లు రీఛార్జ్ చేస్తే అంత బ్యాటరీ లైఫ్ కూడా తగ్గిపోతుందని తెలిసిందే. నిజానికి మనం వాడే ఫీచర్స్ కన్నా దాదాపుగా మనకు తెలియని ఎన్నో ఫీచర్స్ ఐఫోన్ లో ఉంటాయి. ఆపిల్ కంపెనీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అత్యాధునిక ఫీచర్లని ఐఫోన్లలో అందుబాటులో ఉంచింది. నిజానికి చాలామందికి ఇవి ఎలా వాడాలో కూడా తెలియదు. కానీ అవే మన బ్యాటరీ లైఫ్ ని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటి అనవసరమైన ఫీచర్లని కంట్రోల్ చేస్తే బ్యాటరీ కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.

ఐ ఫోన్ బ్యాటరీ సేవింగ్ టిప్స్..

బ్యాటరీ హెల్త్ చెక్: Settings → Battery → Battery Health & Charging లో Maximum Capacity చూడండి. 80% పైన ఉంటే మంచి స్థితిలో ఉన్నట్లు లెక్క.

లాక్ స్క్రీన్ విడ్జెట్‌లు: వెదర్, న్యూస్, స్కోర్ విడ్జెట్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో రిఫ్రెష్ అవుతూ బ్యాటరీని లాగేస్తాయి. లాక్ స్క్రీన్‌పై లాంగ్ ప్రెస్ చేసి, Customize ద్వారా అనవసర విడ్జెట్‌లను తొలగించండి.

యానిమేషన్లు & కీబోర్డ్ హాప్టిక్స్: Settings → Accessibility → Motion లో Reduce Motion ఆన్ చేయండి. టైపింగ్ వైబ్రేషన్ తగ్గించడానికి Settings → Sounds & Haptics → Keyboard Feedback లో Haptic ఆఫ్ చేయండి.

బ్యాక్‌గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ & అప్‌డేట్స్: Settings → General → Background App Refresh లో అవసరం లేని యాప్‌లను ఆఫ్ చేయండి. అలాగే Settings → App Store లో ఆటోమేటిక్ App Updates నిలిపివేయండి.

లొకేషన్ & నోటిఫికేషన్లు: Settings → Privacy & Security → Location Services లో అవసరమైన యాప్‌లకే While Using అనుమతి ఇవ్వండి. Settings → Notifications లో అనవసర యాప్ నోటిఫికేషన్లను ఆఫ్ చేయండి.

డిస్‌ప్లే, లో పవర్ & ఎయిర్‌ప్లేన్ మోడ్: OLED స్క్రీన్‌పై Dark Mode వాడండి; Settings → Accessibility → Display & Text Size లో Auto-Brightness ఆన్ చేయండి. బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు Low Power Mode వాడండి. సిగ్నల్ తక్కువగా ఉన్నప్పుడు Airplane Mode ఆన్ చేస్తే బ్యాటరీ డ్రెయిన్ తగ్గుతుంది.

ఈ చిన్న చిన్న మార్పులతో మీ ఐఫోన్ బ్యాటరీ ఎక్కువ సమయం నిలిచి, ఛార్జర్ కోసం పరుగులు తీసే అవసరం తగ్గుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us