Dual Sim Fraud: రెండు సిమ్ కార్డులు వాడుతున్నట్లయితే తస్మాత్ జాగ్రత్త.. లేకపోతే మీ బ్యాంక్ ఖాళీ.. ఎందుకంటే..

|

Jan 29, 2023 | 10:18 AM

దేశంలోని అత్యధిక మంది జనాభా ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్ధిక లావాదేవీల కోసం యూపీఐ ప్లాట్‌ ఫారమ్స్‌ని కూడా వాడుతున్నారు. అంతేకాదు చాలా మంది సౌలభ్యం..

Dual Sim Fraud: రెండు సిమ్ కార్డులు వాడుతున్నట్లయితే తస్మాత్ జాగ్రత్త.. లేకపోతే మీ బ్యాంక్ ఖాళీ.. ఎందుకంటే..
Dual Sim Fraud
Follow us on

దేశంలోని అత్యధిక మంది జనాభా ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్ధిక లావాదేవీల కోసం యూపీఐ ప్లాట్‌ ఫారమ్స్‌ని కూడా వాడుతున్నారు. అంతేకాదు చాలా మంది సౌలభ్యం కోసం 2 లేదా అంతకంటే ఎక్కువ నంబర్‌లను కలిగి ఉంటున్నారు. ఫోన్‌లో డ్యూయల్ సిమ్‌ని ఉపయోగిస్తున్నారు. కానీ ఒకటే నెంబర్‌ యాక్టివ్‌గా ఉంచుతున్నారు. రెండవ నంబర్‌కు రీఛార్జ్ చేయడం మరిచిపోతున్నారు. ఇదే వారు చేస్తున్న తప్పు. ఇంకా దీని ఫలితంగా తమ సర్వస్వం కోల్పోతున్నారు. మీ ఫోన్‌లో ఉన్న రెండవ సిమ్‌ని రీఛార్జ్ చేయడం మర్చిపోతే అది మీకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. మీరు చేసిన ఈ తప్పు సైబర్ దొంగలకు వరం కంటే తక్కువేమి కాదు. ఈ చిన్న అజాగ్రత్త కారణంగా జీవితకాల సంపాదనను కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. గత కొద్ది కాలంగా దేశంలో అనేక ఫ్రాడ్‌ కేసులు తెరపైకి వచ్చాయి. చాలామంది సెకండ్‌ సిమ్‌కి రీఛార్జ్‌ చేయక సైబర్‌ నేరస్థుల చేతిలో మోసపోతున్నారు.

సైబర్ దుండగులు లాక్ చేసిన సిమ్ కార్డులను మళ్లీ పొంది లక్షల్లో మోసం చేసిన అనేక ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ KYC ద్వారా సిమ్‌లని కొనుగోలు చేసి మోసాలకి పాల్పడుతున్నారు. ఈ సైబర్ నేరగాళ్లు ముందుగా నకిలీ IDతో లాక్ చేసిన SIMని కొనుగోలు చేస్తారు. చాలా సందర్భాలలో వారు సిమ్ విక్రేతలతో కుమ్మక్కవుతున్నారు. మీ పాత 10 అంకెల నంబర్‌లను కొనుగోలు చేసి వారి బ్యాంక్ ఖాతా, ఈమెయిల్ ఐడిని తెలుసుకుంటారు. ఈ నేరస్థులు ఈ సిమ్‌ల నుంచి BHIM-UPI, Paytm, Phonepay లేదా Google Pay వంటి ఏదైనా యాప్‌కి లాగిన్ అవుతారు. వీటిని మీ బ్యాంక్ ఖాతా నంబర్, ఈ మెయిల్ IDకి జతచేస్తారు. కానీ UPI ద్వారా డబ్బును బదిలీ చేయరు. ఎందుకంటే UPI ద్వారా కేవలం ఒక రోజులో రూ.1 లక్ష వరకు మాత్రమే లావాదేవీలు చేయవచ్చు.

అలాగే మీ బ్యాంక్ ఖాతా వివరాలను తీసుకున్న తర్వాత ఈ దుండగులు బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వెబ్‌సైట్‌కి వెళ్లి అక్కడ ఫర్గెట్ యూజర్‌ఐడిపై క్లిక్ చేస్తారు. బ్యాంక్ వెబ్‌సైట్ ఖాతా నంబర్, ఈ మెయిల్, రిజిస్టర్ చేసిన ఫోన్ నంబర్‌ను ఎంటర్‌ చేయమని అడుగుతుంది. అప్పుడు బ్యాంక్‌లో రిజిస్టర్ అయిన పాత నెంబర్‌కే ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్‌ చేసి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఐడిని తెలుసుకుంటాడు.ఈ ప్రక్రియ ద్వారా దుండగులు ఫర్గెట్ పాస్‌వర్డ్ ఎంపికను ఉపయోగించి కొత్త పాస్‌వర్డ్‌ను రూపొందిస్తారు.దీని తర్వాత ఖాతాను తెరిచి ఆపై మొత్తం దొంగిలిస్తారు. మీరు ఇప్పటికే రెండో సిమ్‌ వాడటం లేదు కాబట్టి లావాదేవీలకి సంబంధించి మెస్సేజ్‌లు పొందే అవకాశం లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..