Vajra Super Shot: రంగంలోకి “వజ్ర సూపర్ షాట్”.. ఇకపై ఐపీఎల్‌ మ్యాచ్‌లలో భద్రత మరింత కట్టుదిట్టం!

జమ్మూకాశ్మీర్‌లోని పహల్‌గామ్ ఉగ్రదాడి తర్వాత బీసీసీఐ అప్రమత్తమైంది. ఇకపై ఐపీఎల్ 2025 సీజన్‌లో జరగబోయే స్టేడియాల వద్ద భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టంగా చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ‘వజ్ర సూపర్ షాట్’ అనే యాంటీ-డ్రోన్ పరికరాన్ని ఐపీఎల్ స్టేడియంల వద్ద ప్రవేశపెట్టనుంది. అదునాతన టెక్నాలజీతో రూపొందించిన ఈ వజ్ర సూపర్‌ షాట్ స్టేడియంపైకి ప్రమాదకరమైన డ్రోన్స్‌ రాకుండా అడ్డుకుంటుంది.

Vajra Super Shot:  రంగంలోకి “వజ్ర సూపర్ షాట్”.. ఇకపై ఐపీఎల్‌ మ్యాచ్‌లలో భద్రత మరింత కట్టుదిట్టం!
Vajra Super Shot

Updated on: Apr 27, 2025 | 6:56 PM

ఇటీవల జరిగిన పహల్‌గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలోని ప్రధాన ప్రాంతాల్లో భద్రతా చర్యలను చేపట్టాలని ఆయా రాష్ట్రాలకు కేంద్ర నిఘా వర్గాలు ఆదేశాలు జారీ చేశాయి. అయితే ఈ ఉగ్రదాడి తర్వాత బీసీసీఐ కూడా అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ఇకపై ఐపీఎల్ 2025 సీజన్‌లో మ్యాచ్‌లు జరగబోయే స్టేడియాల వద్ద భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయనున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ‘వజ్ర సూపర్ షాట్’ అనే యాంటీ-డ్రోన్ వ్యవస్థను ఐపీఎల్ స్టేడియంల వద్ద ప్రవేశపెట్టనుంది. ఈ వజ్ర సూపర్ షాట్’ గగనతలాన్ని రక్షించడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇటీవలి ఉగ్రవాద సంఘటనల తర్వాత, బహిరంగ కార్యక్రమాలపై డ్రోన్‌లు ఎగురుతాయని పెరుగుతున్న ఆందోళనలతో, అధికారులు ఈ వజ్ర సూపర్ షాట్‌ అను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు సమాచారం.

అసలు వజ్ర సూపర్ షాట్ అంటే ఏమిటి?..

వజ్ర సూపర్ షాట్ అనేది చెన్నైకి చెందిన బిగ్ బ్యాంగ్ బూమ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (BBBS) అభివృద్ధి చేసిన ఓ అత్యాధునిక యాంటీ-డ్రోన్ పరికరం. దీనిని సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లే విధంగా సులభమైన టెక్నాలజీతో రూపొందించారు. ఈ పరికరం తన ఉన్న స్థలం నుంచి సుమారు నాలుగు కిలోమీటర్ల రేడియస్‌లో ఉండే అనధికారిక డ్రోన్‌ల కదలికలను గుర్తించి.. వాటి సమాచార వ్యవస్థను నాశనం చేస్తోంది. డ్రోన్ నియంత్రణలకు భంగం కలిగించే రేడియో సంకేతాలను పంపడం ద్వారా ఇది పనిచేస్తుంది. ఇది ఇతర ప్రమాదకరమైన డ్రోన్స్‌ స్టేడియం ప్రాంతంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. ఈ కొత్త టెక్నాలజీ వ్యవస్థను మొదటిసారిగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ లో కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ లో ఉపయోగించారు.

ఈ వజ్ర సూపర్ షాట్‌ను ఎలా ఉపయోగిస్తారు..

ఈ వజ్ర సూపర్ షాట్‌ను మ్యాచ్‌లకు ఎటువంటి అంతరాయాలు లేకుండా సజావుగా జరిగేలా, ఆటగాళ్లు, అభిమానులు, అధికారులు సురక్షితంగా ఉండేలా చూసుకోవడానికి దీనిని ఉపయోగిస్తున్నారు. మ్యాచ్‌ స్టార్ట్‌ అయ్యే ముందే ఈ వజ్ర సూపర్ షాట్‌తో పరిసర ప్రాంతాలను స్కాన్‌ చేస్తారు. భద్రతా బృందాలకు వీటిని ఆపరేట్‌ చేసే వారికి ప్రత్యేక శిక్షణను ఇచ్చాయి. వారు నిరంతరం ఆకాశాన్ని స్కాన్ చేస్తూ.. అనుమానాస్పద డ్రోన్‌ను కనిపిస్తే అవి స్టేడియంలోని ప్రజలకు హాని కలిగించకుండా వాటిని సురక్షితంగా కిందకు దించుడానికి ఈ వజ్ర సూపర్‌ షాట్‌ను ఉపయోగిస్తారు. ఈ కొత్త టెక్నాలజీని మొదటి సారిగా ఏప్రిల్ 26న ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఉపయోగించారు.

మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…