Camera For Blind: అంధుల కోసం ప్రత్యేక కెమెరా రూపొందించిన అమెరికా శాస్ర్తవేత్తలు.. ముందుగానే అలర్ట్‌ చేసే వ్యవస్థ.

|

Jul 26, 2021 | 8:29 AM

Camera For Blind: అంధులు ఎదుర్కొనే సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా ఒంటరిగా జీవించే వారికి ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. అయితే పూర్తిగా కళ్లు కనిపించని...

Camera For Blind: అంధుల కోసం ప్రత్యేక కెమెరా రూపొందించిన అమెరికా శాస్ర్తవేత్తలు.. ముందుగానే అలర్ట్‌ చేసే వ్యవస్థ.
Device For Blind
Follow us on

Camera For Blind: అంధులు ఎదుర్కొనే సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా ఒంటరిగా జీవించే వారికి ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. అయితే పూర్తిగా కళ్లు కనిపించని వారు కొందరైతే తక్కువ దృష్టి లోపంతో ఉండే వారు మరికొందరు ఉంటారు. సాధారణంగా కొంతమేర దృష్టి లోపం ఉన్నవారు. కర్ర సహాయంతో నడవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఇలాంటి సందర్భాల్లోనూ అనుకోని పరిస్థితుల్లో ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికే అమెరికా శాస్ర్తవేత్తలు రెండు పరికరాలను రూపొందించారు. చెస్ట్‌ మౌంటెడ్‌ వీడియో కెమెరాతో పాటు వైబ్రేటింగ్‌ బ్యాండ్‌ను పరిచయం చేశారు.

అమెరికాలోని జనరల్‌ బ్రిఘమ్ ఆసుప్రతికి చెందిన పరిశోధకులు ఈ రెండు గ్యాడ్జెట్లను అభివృద్ధి చేశారు. ఈ చెస్ట్‌ మౌంటెడ్‌ వీడియో కెమెరాను చాతికి ధరించేలా రూపొందించారు. దీంతో యూజర్ల ముందు ఏం జరుగుతుందన్నది అంతా కెమెరాలో నిక్షిప్తం అవుతుంది. ఎదురుగా ఏదైనా వాహనం వస్తోన్నా అడ్డుగా ఏదైనా వస్తువు ఉన్నా వెంటనే యూజర్‌కు అలర్ట్‌ వస్తుంది. ఇక వైబ్రేటింగ్‌ బ్యాండ్‌ను చేతికి ధరించాల్సి ఉంటుంది. ముందుగా ఏదైనా వస్తువు ఉంటే వెంటనే వైబ్రేటింగ్‌ ద్వారా యూజర్‌ను అలర్ట్‌ చేస్తుంది. ఈ గ్యాడ్జెట్ల ద్వారా కరెంట్‌ పోల్స్‌, మ్యాన్ హోల్స్ వంటి ప్రమాదకర ప్రాంతాలను గుర్తించడం ద్వారా చూపులేని వారు ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ వ్యవస్థను ఉపయోగించడం ద్వారా అమెరికాలో ఇప్పిటి వరకు 37 శాతం ప్రమాదాలు తగ్గాయని తెలిపారు.

Also Read: Smartphone: మీ పాత ఫోన్‌ వేరే వ్యక్తులకు అమ్మేస్తున్నారా..? అయితే ఇది తప్పనిసరిగా చేయాల్సిందే.. ఎందుకంటే..!

Yellow Tongue: పూర్తిగా పసుపు రంగులోకి మారిన బాలుడి నాలుక.. అరుదైన వ్యాధే కారణమంటోన్న వైద్యులు.

Whatsapp Shortcuts: మీరు వాట్సాప్‌ ఉపయోగిస్తున్నారా..? అయితే ఈ షార్ట్‌కట్స్‌ గురించి తెలుసుకోండి..!