బిగ్ బిలియన్ డేస్ పేరుతో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఆఫర్ల వర్షం కురిపిపించిన విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా ఎన్నో రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందించింది. ఇదిలా ఉంటే ఈ సేల్‌కు తోడుగా తాజాగా ఫ్లిప్‌కార్ట్ మరో సేల్‌లోను తీసుకొస్తోంది. దసరా పండగ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఫ్లిప్ కార్ట్ ఈ సేల్‌ను తీసుకొస్తోంది. ‘బిగ్ దసరా సేల్’ పేరుతో యూజర్లను ఆక్టుకునే పనిలో పడింది ఫ్లిప్ కార్ట్.
అక్టోబర్ 22వ నంఉచి 29వ తేదీ వరకు ఈ సేల్‌ను అందుబాటులో ఉండనుంది. మొత్తం 8 రోజుల పాటు జరగనున్న ఈ సేల్‌లో ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. ఈ సేల్‌లో భాగంగా పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. కోటక్, ఆర్‌బీఎస్, ఎస్‌బీఐ వంటి కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే ఐసీఐసీఐ కార్డుకు చెందిన డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసినా 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ పొందొచ్చు.
ఈ సేల్ తర్వాత ఫ్లిప్ కార్ట్ మరో సేల్‌ను నిర్వహించనుంది. దీపావళి పండుగ సందర్భంగా ఈ సేల్‌లో నిర్వహించనుంది. ఈ సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొదలు, గృహోపకరణాలు, వస్త్రాల వరకు అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై ఊహకందని డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. స్మార్ట్ వాచ్‌లపై కనీసం 45 శాతం డిస్కౌంట్, బేబీ కేర్ ప్రొడక్ట్స్‌పై 70 శాతం వరకు, కిడ్స్ ఫెస్టివ్ వియర్‌పై 80 శాతం వరకు, జువెలరీపై 60 నుంచి 90 శాతం వరకు, టీవీలపై 80 శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నారు.
వీటితోపాటు వస్త్రాల విషయానికొస్తే.. మహిళల చీరలపై కనీసం 70 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. లాగే మహిళల లెహంగాలపై 70 శాతం, ఫెస్టివ్ కుర్తాస్‌పై 50 శాతం, వాచ్‌లపై 50 శాతం, పర్‌ఫ్యూమ్‌లపై 60 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు.
ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్‌లను తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశాన్న కల్పించారు. మోటరోలా ఎడ్జ్ 40 ధరను రూ. 25,749కి సొంతం చేసుకోవచ్చు. ఇక ఒప్పో రెనో 10 5జీ స్మార్ట్ ఫోన్‌ను రూ. 29,99కి, గూగుల్ పిక్సెల్ 7ఏ రూ. 32,499, సామ్‌సంగ్ ఎస్22 5జీ రూ. 38,999, పోకో ఎఫ్5 స్మార్ట్ ఫోన్ రూ. 23,999, వివో టీ2 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్‌ను డిస్కౌంట్‌లో భాగంగా రూ. 21,999కి సొంతం చేసుకోవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..