You Tube: యూట్యూబ్ యాడ్స్ తో విసిగిపోయారా.. ఇలా చేస్తే ఆ బాధే ఉండదు

|

May 04, 2022 | 3:08 PM

యూట్యాబ్(You tube) లో వీడియో ప్లే అవుతున్నప్పుడు మధ్యలో వచ్చే యాడ్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా..? స్కిప్ చేయలేని అడ్వర్టైజ్మెంట్ తో చికాకు కలుగుతోందా.. ? గతంలో వీడియో ప్లే అవడానికి ముందు ఒక్క యాడ్...

You Tube: యూట్యూబ్ యాడ్స్ తో విసిగిపోయారా.. ఇలా చేస్తే ఆ బాధే ఉండదు
Youtube
Follow us on

యూట్యాబ్(You tube) లో వీడియో ప్లే అవుతున్నప్పుడు మధ్యలో వచ్చే యాడ్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా..? స్కిప్ చేయలేని అడ్వర్టైజ్మెంట్ తో చికాకు కలుగుతోందా.. ? గతంలో వీడియో ప్లే అవడానికి ముందు ఒక్క యాడ్ మాత్రమే ఉండేది. రాను రాను యాడ్స్(Adds) సంఖ్య పెరిగింది. అంతే కాదండోయ్.. స్కిప్ చేసే ఆప్షన్ కూడా యాడ్స్ కు ఉండటం లేదు. ఇలాంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికీ అనుభవమే. ఈ ఇబ్బందులు తొలగించేందుకు యూట్యాబ్ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. యూట్యూబ్ లోప్రకటనలు లేకుండా చూడాల‌నుకుంటే ప్రీమియం యాక్సెస్ తీసుకునేలా వెసులుబాటు కల్పించింది. యూట్యూబ్ ప్రీమియం ప్లాన్ తీసుకుంటే ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టవచ్చని యూట్యూబ్ చెబుతోంది. ఈ నెలవారీ ప్లాన్లు రూ.129 నుంచి ప్రారంభమవుతాయి. మరోవైపు.. ప్రీమియం ప్లాన్‌ను కొనుగోలు చేయకుండానే యాడ్స్ లేకుండా వీడియో చూడాలనుకుంటే.. యాడ్స్ బ్లాకర్ ఉపయోగపడుతుంది. సెల్ ఫోన్ లేదా పర్సనల్ కంప్యూటర్‌లో ఈజీగా యాడ్ బ్లాకర్‌ ఉపయోగించవచ్చు.
యూడ్ బ్లాకర్ ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, యాడ్స్ లేకుండానే యూట్యూబ్ వీడియోలు చూడవచ్చు. అంతేకాకుండా థర్డ్ పార్టీ యాడ్ బ్లాకర్ యాప్‌లనూ ఉపయోగించవచ్చు.

దీని కోసం గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాడ్ బ్లాక్ & ప్రైవేట్ బ్రౌజర్‌ని డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇది చాలా సాధారణమైనది. సైట్‌లలో కనిపించే చాలా ప్రకటనలను బ్లాక్ చేస్తుంది.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

IPL 2022: గుజరాత్ బౌలర్లను చీల్చి చెండాడిన రూ. 11 కోట్ల పంజాబ్ ప్లేయర్.. భారీ సిక్సర్లతో ఊచకోత.. స్పెషల్ రికార్డు కూడా..

AP: పోలీసులని చూడగానే కారు వదిలేసి ఎస్కేప్.. అసలు ఏంది కథ అని వాహనం చెక్ చేయగా..