Amazfit Pop 3s: మార్కెట్‌లోకి నయా స్మార్ట్ వాచ్ ఎంట్రీ.. ప్రీమియం లుక్‌తో అదిరిపోయే ఫీచర్లు

ప్రస్తుతం మారిన టెక్నాలజీ ప్రకారం అన్ని సదుపాయాలు స్మార్ట్ వాచ్‌లోనే ఉంటున్నాయి. ముఖ్యంగా మనం రోజువారీ చేసే పనులను స్మార్ట్ వాచ్ ట్రాక్ చేస్తుంది. దీంతో పాటు ఆరోగ్య పరిరక్షణకు సూచనలు ఇస్తుంది. ఎస్‌పీఓ2 స్థాయి, బీపీ వంటివి నిరంతంర ట్రాక్ చేస్తూ సూచనలు ఇస్తుంది. దీంతో టాప్ కంపెనీలన్నీ కొత్తకొత్త స్మార్ట్ వాచ్‌లను రిలీజ్ చేస్తున్నాయి.

Amazfit Pop 3s: మార్కెట్‌లోకి నయా స్మార్ట్ వాచ్ ఎంట్రీ.. ప్రీమియం లుక్‌తో అదిరిపోయే ఫీచర్లు
Amazfit Pop 3s

Updated on: Jun 09, 2023 | 4:30 PM

ప్రస్తుతం యువత ఎక్కువగా స్మార్ట్ యాక్ససరీస్ అంటే ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్‌తో స్మార్ట్ యాక్ససరీస్‌ను కనెక్ట్ చేసేలా అవకాశం ఉండడంతో యువత ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ యాక్ససరీస్‌లో స్మార్ట్ వాచ్‌లపై  ఆదరణ చూపుతున్నారు. గతంలో వాచ్‌లను కేవలం సమయం చూసుకోవడానికి మాత్రమే ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం మారిన టెక్నాలజీ ప్రకారం అన్ని సదుపాయాలు స్మార్ట్ వాచ్‌లోనే ఉంటున్నాయి. ముఖ్యంగా మనం రోజువారీ చేసే పనులను స్మార్ట్ వాచ్ ట్రాక్ చేస్తుంది. దీంతో పాటు ఆరోగ్య పరిరక్షణకు సూచనలు ఇస్తుంది. ఎస్‌పీఓ2 స్థాయి, బీపీ వంటివి నిరంతంర ట్రాక్ చేస్తూ సూచనలు ఇస్తుంది. దీంతో టాప్ కంపెనీలన్నీ కొత్తకొత్త స్మార్ట్ వాచ్‌లను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా భారతదేశంలో అమెజ్ పాప్ 3ఎస్ స్మార్ట్‌వాచ్ రిలీజ్ చేసింది. ప్రీమియం లుక్‌తో అదిరిపోయే డిజైన్‌తో ఈ స్మార్ట్ వాచ్ అందరినీ ఆకర్షిస్తుంది. కాబట్టి ఈ స్మార్ట్ వాచ్ ఫీచర్లు ఏంటో ఓ లుక్కేద్దాం.

అమెజ్ పాప్ 3 ఎస్ స్పెసిఫికేషన్లు ఇవే

అమెజ్ పాప్ 3 ఎస్ వాచ్‌ అంతర్నిర్మిత స్పీకర్, మైక్రోఫోన్ ద్వారా బ్లూటూత్ కాలింగ్‌కు మద్దతును అందిస్తుంది. ఈ ఫీచర్ గత మోడల్ అయిన పాప్ 2లో కూడా అందుబాటులో ఉంది. ఈ వాచ్ ఏఓడీ మద్దతుతో 1.96 అంగుళాల చదరపు ఆకారపు ఎమో ఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. 502 x 410 పిక్సెల్స్, 330 పీపీఐ రిజల్యూషన్‌ను అందిస్తుంది. అలాగే ప్యానెల్ 2.5డీ కర్వ్డ్ గ్లాస్‌తో వస్తుంది. మెటాలిక్ మిడ్-ఫ్రేమ్ ద్వారా మద్దతు ఇస్తుంది. వాచ్ స్ట్రిప్‌తో పాటు బటన్లు స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేశారు. ఆప్టికల్ హృదయ స్పందన సెన్సార్, రక్త ఆక్సిజన్ స్థాయి పర్యవేక్షణ కోసం ఎస్పీఓ2 సెన్సార్‌తో వస్తుంది. ఇది నిద్రను ట్రాక్ చేస్తుంది. లాగే ఒత్తిడిని పర్యవేక్షిస్తుంది. ఇది 100 ప్లస్ స్పోర్ట్స్ మోడ్స్‌తో పాటు మ్యూజిక్ ప్లేబ్యాక్ కంట్రోల్, యాప్ నోటిఫికేషన్‌లు, కెమెరా షట్టర్ నియంత్రణలతో పాటు ఇతర ప్రాథమిక ఫీచర్‌లకు మద్దతును అందిస్తుంది. వినియోగదారులు ఈ ఐపీ 68 రేటెడ్ వాచ్‌లో 100 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌ల నుండి ఎంచుకోవచ్చు. ఈ వాచ్‌ను ఓ సారి పూర్తిగా ఛార్జ్‌ చేస్తే 12 రోజుల వరకు ఉండేలా రేట్ చేశారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..