Breaking News
  • భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 24,248 కేసులు, 425 మంది మృతి. దేశవ్యాప్తంగా 6,97,413 కేసులు,19,693 మంది మృతి. దేశ వ్యాప్తంగా 2,53,287 యాక్టీవ్ కేసులు,4,24,433 మంది డిశ్చార్జ్. దేశంలో 60.77 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • హైదరాబాద్‌లో లాలాపేట పరిధిలో సాధారణ ఇంటికి రూ.25 లక్షల కరెంట్ బిల్లు. మార్చి 6 నుంచి జులై 6 వరకు బిల్లు తీశారు. ఈ నాలుగు నెలల్లో 34,5007 యూనిట్లు విద్యుత్ వాడినట్లు చూపించి.. ఏకంగా రూ. 25,11,467 బిల్లు వేశారు.
  • అమరావతి: మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టు లో పిటిషన్. పిటిషన్ దాఖలు చేసిన అచ్చెన్నాయుడు తరపు న్యాయవాదులు. ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టు అయిన అచ్చెన్నాయుడు . ప్రస్తుతం విజయవాడలో జైల్లో ఉన్న అచ్చెన్నాయుడు. వెంటనే బెయిల్ ఇవ్వాలని పిటిషన్ లో కోరిన న్యాయవాది. ఇప్పటికే ఏసీబీ కస్టడీ కూడా ముగిసిందని పిటిషన్ లో పేర్కొన్న న్యాయవాది. ఏసీబీ కోర్టు బెయిల్ పిటీషన్ ను సస్పెండ్ చేయడంతో హైకోర్టు ను ఆశ్రయుంచిన అచ్చెన్నాయుడు తరపు న్యాయవాదులు.
  • హైదరాబాద్ కమిషనరేట్ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2017 సంవత్సరంలో జరిగిన మైనర్ రేప్ కేసులో నిందితుడికి 10 సంవత్సరాల జైల్ శిక్ష విధించిన కోర్టు.
  • కృష్ణజిల్లా: మచిలీపట్నం సబ్ జైలు నుంచి కొల్లు రవీంద్రను రాజమండ్రి తరలింపు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు న్యాయమూర్తి అనుమతి. గత రెండురోజులుగా మచిలీపట్నం సబ్ జైల్లో ఉన్న కొల్లు రవీంద్ర. వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో అరెస్ట్ అయిన మాజీమంత్రి కొల్లు. అరెస్ట్ ను ఖండిస్తూ టీడీపీ నేతలు నిరసన. సబ్ జైలుకు చేరుకుని నల్ల బ్యార్జ్ లతో నిరసన. భారీ బందోబస్తు తో కొల్లు రవీంద్ర ను తరలించిన పోలీసులు.
  • కృష్ణాజిల్లా: మచిలీపట్నంలో కేటుగాడు అరెస్ట్. నకిలీ ఈపాస్ లు సృష్టించిన కేసులో అరెస్ట్. నిందితుడు ప్రకాశం జిల్లాకు చెందిన పవన్ కుమార్ గా గుర్తింపు. 73 మందికి ఫోర్జరీ చేసిన ఈపాస్ లు ఇచ్చినట్టు నిర్దారణ. హైదరాబాద్ లోని ఓ కన్సల్టెన్సీ కంపెనీలో పని చేస్తున్న పవన్.
  • పాఠశాల విద్య శాఖ కమిషనర్ కార్యక్రమంలో ఏసీబీ రైడ్స్. లకిడికపూల్ లోని పాఠశాల విద్య శాఖ కమిషనర్ కార్యక్రమంలో సూపరింటెండెంట్ , జూనియర్ అసిస్టెంట్ లు 40 వేలు లంచం తీసుకుంటుండగా ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. మేడ్చెల్ జిల్లా ఘట్కేసర్ లోని సాంటా మారియా స్కూల్ లో స్టేట్ సిలబస్ నుంచి సెంట్రల్ సిలబస్ ( సీబీఎస్ఈ ) గా మార్చడానికి ఎన్ఓసీ సర్టిఫికెట్ కోసం స్కూల్ వద్ద డబ్బులు డిమాండ్.

2019ని గ్రాండ్ విక్టరీతో ముగించిన టీమిండియా..

Cuttack Odi: India Clinch Odi Series Against West Indies, 2019ని గ్రాండ్ విక్టరీతో ముగించిన టీమిండియా..

సీరిస్ ఎవరిదో తేల్చుకోవాల్సిన కీలక వన్డేలో టీమిండియా చెలరేగిపోయింది. టీ20 సిరీస్‌లో వెస్టిండీస్‌ను  2-1 తేడాతో ఓడించిన భారత్..వన్డేల్లో కూడా అదే తరహాలో విజయం సాధించింది. 316 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా, 6 వికెట్లు కొల్పోయి..48.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని రీచ్ అయ్యింది.  విరాట్ కోహ్లీ (85: 81 బంతుల్లో 9×4) కెప్టెన్ ఇన్సింగ్స్‌తో చెలరేగిపోగా,  ఓపెనర్లు కేఎల్ రాహుల్ (77: 89 బంతుల్లో 8×4, 1×6), రోహిత్ శర్మ (63: 63 బంతుల్లో 8×4, 1×6) హాఫ్ సెంచరీలతో తమ మార్క్ చూపించారు. ఈ విజయంతో వెస్టిండీస్‌పై పది సిరీస్‌లు గెలిచి హిస్ట్రీ క్రియేట్ చేసింది భారత్.

316 అనేది భారీ టార్గెట్..అయినా కూడా టీమిండియా ఓపెనర్లు రోహిత్-రాహుల్‌లు దాటిగా ఆడుతూ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు దాటిన క్రమంలో రాహుల్​(77)ను అల్జారీ జోసెఫ్ ఔట్ చేశాడు.  శ్రేయస్ అయ్యర్ (7), రిషబ్ పంత్ (7), జాదవ్ (9) త్వరత్వరగా ఔటవ్వడంతో ఫ్యాన్స్‌లో, డకౌట్‌లో కాస్తంత ఆందోళన కనిపించింది. కానీ కోహ్లి కెప్టెన్ (85) ఇన్సింగ్స్‌తో మ్యాచ్‌ను మనవైపుకు తిప్పాడు. భారత్ విజయం ఖాయమనుకుంటున్న టైంలో  47 ఓవర్లో కోహ్లీ కీమో పాల్ ఔట్ అవ్వడంతో మళ్లీ ఉత్కంఠ పెరిగింది. చివర్లో జడేజా, శార్దూల్ ఠాకూర్ భారీ షాట్స్‌తో రెచ్చిపోయి నాలుగు వికెట్ల తేడాతో టీమిండియాకు ఘనవిజయాన్ని కట్టబెట్టారు.

Related Tags