పైరసీ కా బాప్ ‘తమిళ్‌ రాకర్స్’ ఖేల్ ఖతం..!

తమిళ్ రాకర్స్ వెబ్‌సైట్…‌ పైరసీ సినిమాలకు ఇదొక కేంద్ర బిందువు. గత కొన్నేళ్లుగా తమిళ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైన సినిమాల..

పైరసీ కా బాప్ 'తమిళ్‌ రాకర్స్' ఖేల్ ఖతం..!
Follow us

|

Updated on: Oct 20, 2020 | 11:45 AM

Tamilrockers Website Blocked:  తమిళ్ రాకర్స్ వెబ్‌సైట్‌ పైరసీ సినిమాలకు ఇదొక కేంద్ర బిందువు. గత కొన్నేళ్లుగా తమిళ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, కన్నడ భాషల్లోనే కాకుండా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లలో విడుదలైన సినిమాల పైరేటెడ్ వెర్షన్స్ అన్నింటిని ఈ తమిళ్ రాకర్స్ తమ సైట్‌లో అప్‌లోడ్ చేసుకుంటూ వచ్చింది . ఈ వెబ్‌సైట్ వల్ల కోలీవుడ్ ఇండస్ట్రీ భారీగా నష్టాలు చవి చూసిందని చెప్పాలి. ఎంతోమంది సాంకేతిక నిపుణుల శ్రమను.. నిర్మాతల డబ్బుతో చెలగాటం ఆడుతూ వచ్చిన ఈ వెబ్‌సైట్ పూర్తిగా మూసివేయబడినట్లు తెలుస్తోంది.

డిజిటల్ మిలీనియం కాపీరైట్ చట్టం ప్రకారం తాజాగా అమెజాన్ ఇంటర్నేషనల్ తమిళ్ రాకర్స్‌కు వ్యతిరేకంగా పలు కంప్లయింట్స్ దాఖలు చేసింది. దీనితో ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్(ICANN) రిజిస్ట్రీ ద్వారా ఆ సైట్‌ను తొలగించారట. అంతేకాదు నిన్నటి నుంచి ట్విట్టర్‌లో తమిళ్ రాకర్స్ వెబ్‌సైట్ షట్ డౌన్‌కు సంబంధించిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం త్వరలోనే మళ్లీ సైట్ కొత్త డొమైన్ ద్వారా అందుబాటులోకి వస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.