లాక్‌డౌన్ మా పెళ్లికి అడ్డురాదంటూ..ఒక్కటైన జంట..

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి విళయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మన దేశంలో కూడా ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం.. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చ్‌లు మూతపడ్డాయి. నిత్య దీపారాదన కార్యక్రమాలు చేస్తున్నా.. భక్తులకు మాత్రం నో ఎంట్రీ. అయితే ఇది పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. ఇక ఇంతకు ముందు ముహూర్తాలు పెట్టుకున్న వారికి తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. కొందరు […]

లాక్‌డౌన్ మా పెళ్లికి అడ్డురాదంటూ..ఒక్కటైన జంట..
Follow us

| Edited By:

Updated on: Mar 31, 2020 | 6:52 PM

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి విళయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మన దేశంలో కూడా ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం.. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చ్‌లు మూతపడ్డాయి. నిత్య దీపారాదన కార్యక్రమాలు చేస్తున్నా.. భక్తులకు మాత్రం నో ఎంట్రీ. అయితే ఇది పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. ఇక ఇంతకు ముందు ముహూర్తాలు పెట్టుకున్న వారికి తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. కొందరు పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటే.. మరికొందరు కుటుంబ సభ్యుల మధ్యే జరుపుకుంటున్నారు. తాజాగా.. చెన్నైలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. మదురైకి చెందిన ఓ జంట తమ వివాహాన్ని తిరుపురుకుండ్రంలోని మురుగన్‌ గుళ్లో జరిపించుకోవాలని ఆశపడ్డారు. అయితే లాక్‌డౌన్‌ నేపథ్యంలో గుడి మూసివేయడంతో, గుడి తలుపులు ముందే.. బంధువుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. కాగా.. ఇప్పటి వరకు తమిళనాడులో 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.