18 ఏళ్ల తర్వాత సెలవు తీసుకున్నా..

Story On PM Modis Man vs Wild Episode, 18 ఏళ్ల తర్వాత సెలవు తీసుకున్నా..

బేర్ గ్రిల్స్ అనే సాహసవీరునితో కలిసి మోదీ చేసిన సాహసయాత్ర ఆసక్తికరంగా సాగింది. తాను సాహసయాత్రకు వెళ్లడాన్ని సెలవుగానే భావిస్తే.. 18 సంవత్సరాల తర్వాత తాను సెలవు తీసుకున్నట్లేనని ప్రధాని మోడీ అన్నారు. సుమారు 250 రాయల్ పులులు సంచరించే ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ అభయారణ్యంలో బేర్ గ్రిల్స్‌తో కలిసి ఆయన సాయసయాత్ర చేశారు. భారతదేశవ్యాప్తంగా 100 భాషలు, 1600 మాండలికాలున్నాయి. ఇంత వైవిధ్యం ప్రపంచంలో ఎక్కడా కనిపించలేదని బేర్ గ్రిల్స్‌తో ప్రధాని మోడీ అన్నారు. ఈ ప్రయాణంలో మోదీ బాల్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు బేర్ గ్రిల్స్. తానే చిన్నప్పుడు నదుల్లో స్నానం చేసేవాడినని, తమకు అంతకుమించిన వసతులు ఉండేవికాదని మోదీ గుర్తు చేసుకున్నారు. చెరువులో స్నానం చేస్తున్నప్పుడు మొసలి పిల్ల దొరికితే ఇంటికి తీసుకెళ్లానని, దాన్ని చూసి అమ్మ హింసించడం మంచిదికాదని చెప్పి తిరిగి నీళ్లలోనే వదిలిపెట్టమనడంతో చెరువులోనే వదిలానని మోదీ చెప్పారు. తన చిన్నతనంలో వర్షం పడినప్పుడు మోదీ నాన్న తన బంధువులందరికీ ఉత్తరాలు రాసేవారని చెప్పారు. అయితే అది ఇప్పుడే తనకు అర్థమైందని ఆయన్నారు. ప్రకృతి నుంచి మనం ఏదైనా తీసుకుంటే 50 ఏళ్ల తర్వాత పుట్టే పిల్లలు ప్రశ్నిస్తారు. వారికి మనమేం సమాధానం చెబుతాం..? అందుకే అది గుర్తుపెట్టుకుని ప్రతిఒక్కరు నడుచుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. గంటపాటు సాగిన ఈ ప్రయాణంలో తనకు అద్భుతమైన ప్రకృతిని చూపించినందుకు బేర్ గ్రిల్స్‌కు మోదీ ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *