Taapsee In Telugu Movie: తెలుగు సినిమాకు ఓకే చెప్పిన తాప్సీ.. కాజల్‌ స్థానాన్ని భర్తీ చేసిందా..?

Taapsee Agreed For Telugu Movie: 'ఝుమ్మంది నాధం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల నటి తాప్సీ పన్ను. తొలి సినిమాలోనే తన అందం...

Taapsee In Telugu Movie: తెలుగు సినిమాకు ఓకే చెప్పిన తాప్సీ.. కాజల్‌ స్థానాన్ని భర్తీ చేసిందా..?
Follow us

|

Updated on: Jan 02, 2021 | 9:04 PM

Taapsee Agreed For Telugu Movie: ‘ఝుమ్మంది నాధం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల నటి తాప్సీ పన్ను. తొలి సినిమాలోనే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది అనతికాలంలోనే మంచి పేరు సంపాదించుకుంది. అనంతరం తెలుగుతో పాటు తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీ హీరోయిన్‌గా మారింది. ఇక బాలీవుడ్‌లో నటించిన ‘పింక్‌’ చిత్రంతో ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకుంది. అక్కడి నుంచి తాప్సీకి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే వచ్చాయి. వాటిని సక్రమంగా వినియోగించుకున్న తాప్సీ మంచి విజయాలను సొంతం చేసుకుంటూ.. ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్‌గా మారింది. ఇక ‘ఆనందో బ్రహ్మ’ చిత్రం తర్వాత తాప్సీ మళ్లీ తెలుగులో స్ట్రెయిట్‌ మూవీ చేయలేదనే చెప్పాలి. తాజా సమాచారం ప్రకారం ఈ బ్యూటీ తెలుగులో నటించడానికి ఓకే చెప్పనట్లు తెలుస్తోంది. తేజ దర్శకత్వం వహిస్తున్న ‘అలివేలు వెంకటరమణ’ చిత్రంలో నటించడానికి తాప్సీ అంగీకరం తెలిపిందని టాక్‌. ఇక ఈ చిత్రంలో మొదట కాజల్‌ నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే కాజల్‌ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో.. ఈ ఛాన్స్ తాప్సీ కొట్టేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో గోపిచంద్‌ హీరోగా నటించనున్నాడని చిత్ర యూనిట్‌ అప్పట్లో ప్రకటించింది. అయితే తాజాగా గోపి చంద్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్‌ అధికారికంగా స్పందించాల్సిందే.

Also Read: Drugs Seized: ఏం ఐడియారా బాబు..! పొత్తి కడుపులో దాచి రవాణా చేస్తున్న డ్రగ్స్‌ను పట్టుకున్న కస్టమ్స్‌ అధికారులు

Latest Articles
క్యాన్సర్‌కి చికిత్సగా సోషల్ మీడియాలో చూసి క్యారెట్ జ్యూస్ డైట్
క్యాన్సర్‌కి చికిత్సగా సోషల్ మీడియాలో చూసి క్యారెట్ జ్యూస్ డైట్
క్రెడిట్ కార్డ్‌లోని 16 అంకెల రహస్యం ఏంటో తెలుసా?ఆసక్తికర విషయాలు
క్రెడిట్ కార్డ్‌లోని 16 అంకెల రహస్యం ఏంటో తెలుసా?ఆసక్తికర విషయాలు
'ఓనర్ అంటే మీలా ఉండాలి మేడమ్'.. MI ప్లేయర్లతో నీతా ఏం చెప్పారంటే?
'ఓనర్ అంటే మీలా ఉండాలి మేడమ్'.. MI ప్లేయర్లతో నీతా ఏం చెప్పారంటే?
ఏపీలో అల్లర్లపై డీజీపీకి సిట్‌ నివేదిక.. మరికొందరు నేతలపై కేసులు!
ఏపీలో అల్లర్లపై డీజీపీకి సిట్‌ నివేదిక.. మరికొందరు నేతలపై కేసులు!
కాల్షియం కార్బైడ్‌తో పండిస్తున్న మామిడి పండ్ల తింటున్నారా..
కాల్షియం కార్బైడ్‌తో పండిస్తున్న మామిడి పండ్ల తింటున్నారా..
అనుకూలంగా కీలక గ్రహాలు.. ఆ రాశుల వారికి రెండు మహా యోగాలు..
అనుకూలంగా కీలక గ్రహాలు.. ఆ రాశుల వారికి రెండు మహా యోగాలు..
'బాహుబలి నన్ను రోడ్డున పడేసింది': జబర్దస్త్ కమెడియన్ ధనరాజ్
'బాహుబలి నన్ను రోడ్డున పడేసింది': జబర్దస్త్ కమెడియన్ ధనరాజ్
ఈ అవయవాలపై పుట్టుమచ్చలు ఉంటే.. అదృష్ట వంతులే!
ఈ అవయవాలపై పుట్టుమచ్చలు ఉంటే.. అదృష్ట వంతులే!
టాప్-అప్ లోన్ అంటే ఏమిటి? ఎలాంటి ప్రాసెస్‌ లేకుండానే రుణం
టాప్-అప్ లోన్ అంటే ఏమిటి? ఎలాంటి ప్రాసెస్‌ లేకుండానే రుణం
నీటి చుక్క కోసం మైళ్లదూరం నడక ప్రయాణం.. మోకాళ్లపై కూర్చొని నిరసన
నీటి చుక్క కోసం మైళ్లదూరం నడక ప్రయాణం.. మోకాళ్లపై కూర్చొని నిరసన
అర్థరాత్రి తెరిచి ఉన్న ఆలయం తలుపులు.. తెల్లారితే షాకింగ్ సీన్..
అర్థరాత్రి తెరిచి ఉన్న ఆలయం తలుపులు.. తెల్లారితే షాకింగ్ సీన్..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?